Share News

HCU Land Dispute: హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:53 PM

HCU Land Dispute: హెచ్‌సీయూ భూములపై హైకోర్టులో విచారణ జరుగగా.. కొన్ని అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాదులు. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది.

HCU Land Dispute: హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే
HCU Land Dispute

హైదరాబాద్, ఏప్రిల్ 7: హెచ్‌సీయూ భూ వివాదంపై (HCU Land Dispute) ఈరోజు (సోమవారం) హైకోర్టులో (Telangana High Court) విచారణ వాయిదా పడింది. ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ అంశం సుప్రీంకోర్టు (Supreme Court) పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కౌంటర్, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీం కోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో హెచ్‌సీయూ భూములపై విచారణ జరుగగా.. పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున ఈనెల 24కు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.


24 లోపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించారు. అలాగే స్టేటస్ రిపోర్టు ఫైల్ చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది తన వాదనలు వినిపించారు. దీంతో ఫేక్ వీడియో, ఫారెస్ట్ తగులబెట్టిన వీడియోలపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ రిపోర్టుపై పోలీసులే కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు తెలిపడంతో.. తదుపరి విచారణ 24కు వాయిదా వేసింది హైకోర్టు.

Medchal Crime News: రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం... చివరకు


మరోవైపు కంచ గచ్చిబౌలి భూములపై ఏఐని (AI) ఉపయోగించి కొన్ని సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయడంపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు (BRS Leader Manne Krishank) పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు క్రిశాంక్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈనెల 9 , 10 , 11 న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. కంచ గచ్చిబౌలి భూముల్లో ఏఐని ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్టు చేసినందున కొన్ని ఆధారాలతో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణను కొనసాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Bengaluru: కామంతో కళ్లు మూసుకుపోయి.. నడి రోడ్డు మీద

Medchal Crime News: రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం... చివరకు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 12:53 PM