Share News

Dilsukhnagar Bomb Blast Case: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

ABN , Publish Date - Apr 08 , 2025 | 10:44 AM

Dilsukhnagar Bomb Blast Case: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది హైకోర్టు.

Dilsukhnagar Bomb Blast Case: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Dilsukhnagar Bomb Blast Case

హైదరాబాద్, ఏప్రిల్ 8: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ బాంబ్ బ్లాస్ట్ కేసులో (Dilsukhnagar Bomb Blast Case) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంతేకాదు.. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్ట్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం.. దోషులందరికీ ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా.. 2013, ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో వరుస బాంబు పేలుళ్ల కేసుపై ఎన్‌ఐఏ సుదీర్ఘంగా విచారణ జరిపింది.


2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించి ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు నిందితులు. సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పును వెల్లడించింది. బాంబ్‌ బ్లాస్ట్‌లో వీరి కుట్ర ఉందని.. దోషులుగా తేల్చింది. ఈ ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పును వెల్లడించింది.

అర్ధరాత్రి బన్నీ ఫ్యాన్స్ రచ్చ


ఉరిశిక్ష పడింది వీరికే..

ఈ కేసులో ఏ2 అసదుల్లా అక్తర్ ( యూపీ), ఏ3జియ ఉర్ రహమాన్ ( పాకిస్థాన్), ఏ4 మహమ్మద్ తహసీన్ అక్తర్ హాసన్ ( బీహార్ ), ఏ5 మహమ్మద్ యాసిన్ భత్కల్, ఏ6 అజాజ్ షేక్ సమర్ అర్మాన్ (మహారాష్ట్ర) ఉన్నారు. అయితే ప్రధాన దోషి అయిన రియాజ్ భత్కల్ అలియాస్ మహమ్మద్ రియాజ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అంతేకాకుండా బాంబు పేలుళ్లలో కీలకంగా వ్యవహరించిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ ముక్బల్ అనారోగ్యంతో గత ఏడాది జులైలో గాంధీ ఆస్పత్రిలో మృతి చెందాడు.


కాగా.. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో 17 మంది మృతి చెందగా.. 130 పైగా గాయాలు అయ్యాయి. దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్‌లో మొదటి బాంబ్ పేలగా.. 100 మీటర్లు దూరంలో ఏ1 మిర్చి సెంటర్ వద్ద రెండో బాంబ్ బ్లాస్ట్ అయ్యింది. సైకిల్‌పై టిఫిన్ బాక్స్‌లో బాంబ్ పెట్టి పేల్చారు ఉగ్రవాదులు. సాయంత్రం 6:58:38 గంటలకు మొదటి పేలుడు, ఆరు సెకన్ల వ్యవధిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (IED) తో 6:58:44 గంటలకు రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో అనేక మంది బాధితులుగా మిగిలారు. వారంతా టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ విక్టిమ్స్ అసోసియేషన్ పేరుతో బాధితుల సంఘం ఏర్పాటైంది. ప్రతి ఏటా కోణార్క్ థియేటర్ వద్ద బాధిత కుటుంబాలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారు అవడంతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం.. ఏమైందంటే..

Trump Tariffs: వడ్డీ రేట్ల తగ్గింపే ట్రంప్‌ అసలు వ్యూహం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 12:19 PM