BRS Warangal Meeting: వరంగల్ బీఆర్‌ఎస్ సభపై హైకోర్టు ఏం తేల్చిందంటే
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:00 PM
BRS Warangal Meeting: హనుమకొండలో బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ సమావేశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ పోలీసులకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

హైదరాబాద్, ఏప్రిల్ 11: వరంగల్ జిల్లా హనుమకొండలో బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై విచారణను తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) వాయిదా వేసింది. హనుమకొండలో సభకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ బీఆర్‌ఎస్ (BRS) హైకోర్టును ఆశ్రయించగా.. ఈరోజు (శుక్రవారం) విచారణ జరిగింది. ఆ సభకు అనుమతిపై పరిశీలిస్తున్నామని కోర్టుకు జీపీ తెలిపారు. వారం రోజుల్లో వరంగల్ సభ అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సభ కోసం బీఆర్‌ఎస్ పెట్టుకున్న పర్మిషన్‌ను అనుమతించకపోవడం, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లే హైకోర్టులో పిటిషన్ వేసినట్లు బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
అయితే 17 లోపు సభ అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21 కి వాయిదా వేసింది. అలాగే వరంగల్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఈనెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది వరకు సభ నిర్వహిస్తామని గులాబీ పార్టీ పేర్కొంది. అయితే అందుకు పోలీసుల అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈరోజు విచారణ జరుగగా.. 17లోపు సభ అనుమతిపై నిర్ణయం తీసుకోవాలంటూ విచారణను వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
Nellore Quartz Scam: బయటకు రానున్న నిజాలు.. వారి గుండెల్లో గుబులే
KTR Vs CM Revanth: రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
Read Latest Telangana News And Telugu News