Share News

Dilsukhnagar Blast Case: మరికొన్ని గంటల్లో దిల్‌సుఖ్‌నగర్ బ్లాస్ట్ కేసులో కీలక తీర్పు

ABN , Publish Date - Apr 08 , 2025 | 08:02 AM

Dilsukhnagar Blast Case: హైదరాబాద్‌లోని దిల్‌సుక్‌నగర్‌లో భారీ బాంబు పేలుళ్లు ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపాయి. ఈ పేలుళ్లను తలుచుకుంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 2013 ఫిబ్రవరి 21వ తేదీన ఈ పేలుళ్లు సంభవించాయి. ఆ దాడిలో 17 మంది మృతిచెందగా.. 150 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి.

Dilsukhnagar Blast Case: మరికొన్ని గంటల్లో దిల్‌సుఖ్‌నగర్ బ్లాస్ట్ కేసులో కీలక తీర్పు
Telangana High Court

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బ్లాస్ట్ కేసులో ఇవాళ(మంగళవారం) తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ప్రకటించనుంది. 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. బాంబు పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.


ఈ బ్లాస్ట్‌లో 17 మంది మృతిచెందగా.. 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బ్లాస్ట్ కేసును ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ కేసులో యాసినన్ బత్కల్‌ను కీలక సూత్రధారిగా గుర్తించారు. ఇప్పటికే ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఎన్ఐఏ స్పెషల్ కోర్టు తీర్పును హైకోర్టులో నిందితులు సవాల్ చేశారు. ఈ కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇవాళ హైకోర్టు ఫైనల్ తీర్పు ప్రకటించనుంది.


కాగా.. హైదరాబాద్‌లోని దిల్‌సుక్‌నగర్‌లో భారీ బాంబు పేలుళ్లు ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపాయి. ఈ పేలుళ్లను తలచుకుంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 2013 ఫిబ్రవరి 21వ తేదీన ఈ పేలుళ్లు సంభవించాయి. ఆ దాడిలో 17 మంది మృతిచెందగా.. 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఎంతోమంది బాధితులు ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించారు. నిందితులకు కఠిన శిక్ష పడకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ హైకోర్టులో ఈ కేసుపై తుది విచారణ జరుగనుంది. ఈ క్రమంలో హై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad: నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Caste Survey: ‘కుల గణన’పై ఎవరూ మాట్లాడొద్దు

High Court: ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు

Read Latest Telangana News and Telugu News

Updated Date - Apr 08 , 2025 | 08:32 AM