Home » Telangana Police
MLA Rajasingh Arrest: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌లో అల్లర్లు జరిగిన నేపథ్యంలో.. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు రాజాసింగ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వైద్యపరీక్ష నిమిత్తం మియాపూర్‌లో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇదిలాఉంటే.. మెదక్‌లో ఘర్షణల నేపథ్యంలో..
రైళ్లో మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బాలిక నిద్రిస్తోంది. బాలిక వద్దకు వెళ్లిన హోంగార్డు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించిన యువతి వెంటనే ఫోన్ ద్వారా తండ్రికి సమాచారం ఇచ్చింది.
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బయటకు వస్తోంది. పోలీసుల విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి పరికరాలు కొనుగోలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. కొన్ని పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Telangana: ఇక్ఫాయి ఘటనపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. లా విద్యార్థిని లేఖ్య వర్ధిని ఒంటిపై గాయాలపై ఇప్పటికీ స్పష్టత రాని పరిస్థితి. వాష్ రూమ్‌లో ఏం జరిగింది అనేది ఇప్పటికీ సస్పెన్సే. అసలు ఘటన ఎలా జరిగిందనే దానిపై యూనివర్సిటీ అధికాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వేడినీళ్ళ కారణంగానే ఘటన జరిగిందని క్లారిటీ ఇవ్వలేము అంటూనే యాసిడ్ ఎటాక్‌ను యూనివర్సిటీ అధికారులు తోసిపుచ్చారు.
Telangana: శంకర్పల్లి ఇక్ఫాయ్ యూనివర్సిటీలో అనుమానాస్పద రీతిలో యువతి శరీరం కాలిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యూనివర్సిటీలో లా ఫైనల్ ఇయర్ చదువుతున్న లేఖ్య అనే విద్యార్థి యాసిడ్ దాడికి గురైనట్లు అనుమానలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Telangana: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్త తెలిపారు. ఆదివారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో డీజీపీ రవి గుప్త మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినిగించుకోవాలని కోరారు. ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఆ తల్లిది గుండెనా? పాషాణమా? అభం శుభం తెలియని 14 ఏళ్ల కూతుర్ని వ్యభిచారంలోకి దించింది. ‘ఆ పాడుపని’ నేను చేయలేనమ్మా అని వేడుకున్నా చిత్రహింసలు పెట్టింది. జట్టు కత్తిరించి.. కర్రతో ఇష్టంవచ్చినట్లు కొట్టింది. ఏడుస్తున్నా కనికరించకుండా బాలికతో వ్యభిచారం చేయించింది. ఇలా ఆ రాకాసి చెరలో చిన్నారి ఏకంగా రెండేళ్లు నరకం చూసింది. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటూ..
Telangana: బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో రిటర్నింగ్ వాల్ వాల్ కూలి ఏడుగురు కూలీలు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైజ్ కన్స్ట్రక్షన్ ఎండీ అరవింద్ రెడ్డిపై బాచుపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు.
Telangana: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చేశారు. ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతో కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రైవేట్ వ్యక్తిని ఖాకీలు నిందితుడిగా చేర్చారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) పై తెలంగాణలోని(Telangana) మొఘల్ పురా పోలీస్ స్టేషన్లో(Moghalpura Police Station) కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అసలు అమిత్ షా పై ఎందుకు కేసు నమోదు చేశారో చూద్దాం..