Share News

Phone Tapping Case: ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ రావే... తేల్చేసిన పోలీసులు

ABN , Publish Date - May 04 , 2024 | 12:43 PM

Telangana: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చేశారు. ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతో కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రైవేట్ వ్యక్తిని ఖాకీలు నిందితుడిగా చేర్చారు.

Phone Tapping Case: ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ రావే... తేల్చేసిన పోలీసులు
Former SIB Chief Prabhakar Rao

హైదరాబాద్, మే 4: తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావే (Former SIB Chief Prabhakar Rao) ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చేశారు. ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతో కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రైవేట్ వ్యక్తిని ఖాకీలు నిందితుడిగా చేర్చారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్ టాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు.

AP Pension: పెన్షన్‌ కోసం వెళ్లి వడదెబ్బ తగిలి పిట్టల్లారాలుతున్న వృద్ధులు


ఎస్‌ఐబీలోని హార్డ్ డిస్క్ ధ్వంసంలో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అని.. ఆయన ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ధ్వంసం చేసినట్లు విచారణలో బయటపడింది. ప్రభాకర్ రావు చెప్పిన నెంబర్లను ప్రణీత్ రావు టాపింగ్ చేసినట్లు బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయారు. దీంతో ప్రభాకర్ రావు కోసం ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

Lok Sabha Polls: క్షీణించిన తేజస్వి యాదవ్‌ ఆరోగ్యం.. ఎన్నికలపై ప్రభావం చూపుతుందా..!

Chennai: ఇక భగభగలే.. నేటినుంచి అగ్నినక్షత్రం ప్రారంభం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 04 , 2024 | 01:02 PM