Share News

TS News: బాచుపల్లి ఘటనపై కేసు నమోదు

ABN , Publish Date - May 08 , 2024 | 10:06 AM

Telangana: బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో రిటర్నింగ్ వాల్ వాల్ కూలి ఏడుగురు కూలీలు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైజ్ కన్స్ట్రక్షన్ ఎండీ అరవింద్ రెడ్డిపై బాచుపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు.

TS News: బాచుపల్లి ఘటనపై కేసు నమోదు
Bachupalli Incident

హైదరాబాద్, మే 8: నగరంలోని (Hyderabad) బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో రిటర్నింగ్ వాల్ వాల్ కూలి ఏడుగురు కూలీలు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైజ్ కన్స్ట్రక్షన్ ఎండీ అరవింద్ రెడ్డిపై బాచుపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురి డెడ్‌బాడీలను ఇప్పటికే గాంధీకి తరలించారు. అలాగే గాయపడిన ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు స్వరాష్ట్రాలకు తరలించనున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. గోడకూలి ఏడుగురి మృతి.. జేసీబీలతో మృతదేహాలు వెలికితీత


ప్రమాదంపై డీసీపీ...

మరోవైపు ఈప్రమాదంలపై బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాత్రి కురిసిన వర్షానికి ప్రహరీ గోడకూలి కార్మికులు మృతి చెందారని తెలిపారు. మొత్తం 7 మంది చనిపోయారని.. వారిలో నలుగురు ఒరిస్సాకు చెందిన వారు, ముగ్గురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు ఉన్నట్లు చెప్పారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో నాణ్యత లోపం కనిపిస్తోందని తెలిపారు. భవన యజమాని అరవింద్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.

TDP Vs YSRCP: రాచమల్లుకు ఎదురుగాలి.. వరదకు కలిసొచ్చేవి ఇవే..!


ప్రమాదం ఇలా...

కాగా.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్‌లో సెంట్రింగ్ పని కార్మికుల షెడ్‌పై రిటన్నింగ్ వాల్ కూలడంతో ఏడుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. సెంట్రింగ్ పని కార్మికుల షెడ్‌పై రిటన్నింగ్ వాల్ కూలి పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని జేసీబీల సాయంతో ఏడు మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వారిలో నాలుగేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

BJP: మైనారిటీలో హరియాణా బీజేపీ ప్రభుత్వం!

CM Revanth Reddy: బాచుపల్లి ఘటనపై రేవంత్ ఆరా

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 08 , 2024 | 10:44 AM