Home » Telangana Politics
విద్యుత్ కొనుగోళ్లు , కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణ(Kaleswaram project)పై మాజీమంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు ఎందుకు లీకులు ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగు నీరు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి (MLA Vivek Venkataswamy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్, జగన్కు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.
రానున్న రోజుల్లో తెలంగాణ(telangana)లో బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చే విధంగా సమిష్టిగా పనిచేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి(Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) పార్టీ అయిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాదు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఆరు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(KCR)ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలకు తాను హాజరుకాబోవడం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. అందుకుగల కారణాలను పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాశారు.
ఓట్ల లెక్కింపు సమీపిస్తుండడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ మొదలైంది. ఈనెల 13న లోక్సభ ఎన్నికలు జరగగా, జూన్ 4 కౌంటింగ్ జరగనుంది. లెక్కింపు సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు కూడికలు, తీసివేతల పనిలో నిమగ్నమయ్యారు. గెలుస్తామా ? లేదా ? అని ద్వితీయ శ్రేణి నేతల వద్ద ఆరా తీస్తున్నారు. గ్రేటర్లో ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపెవరిదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏ నలుగురు కలిసినా ఫలితాలపైనే మాట్లాడుకుంటున్నారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తులు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు స్పష్టం చేశాడు.
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ రాజకీయపార్టీల్లో కొనసాగుతోంది. హైదరాబాద్ లోక్సభ స్థానం మినహిస్తే మిగిలిన 16 నియోజకవర్గాల్లో గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ధీమాగా ఉన్నాయి.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) మల్లు భట్టి విక్రమార్క(mallu Bhatti Vikramarka) అన్నారు. ఈ క్రమంలో వరి కొనుగోళ్ల విషయంలో రైతులు(farmers) ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలు.., ప్రైవేట్ సంస్థలు.., నలుగురు ఎక్కడ కలిసినా ఒకటే చర్చ. అన్నా, ఎన్నికలు ఎలా జరిగాయి..? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలువబోతున్నారు..? ఏ పార్టీకి ఎన్ని స్థానాలొస్తాయి..? సాధారణ పౌరుల నుంచి ఉన్నతాధికారుల వరకు రాజకీయాలపై ఆసక్తి ఉన్న చాలామంది ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రులు తమ నియోజకవర్గా్ల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.