Share News

Phone Tapping Case: సంచలనం.. ఫోన్ ట్యాపింగ్‌లో కీలక వ్యక్తుల పేర్లు..

ABN , Publish Date - May 28 , 2024 | 01:03 PM

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తులు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు స్పష్టం చేశాడు.

Phone Tapping Case: సంచలనం.. ఫోన్ ట్యాపింగ్‌లో కీలక వ్యక్తుల పేర్లు..
Phone Tapping Case

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తులు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు స్పష్టం చేశాడు.

(This Article an Updating)


భుజంగరావు వాంగ్మూలంలోని కీలక వివరాలు..

బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసి పెట్టాం. ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారి ఫోన్లను ట్యాప్ చేశాం. ప్రణీత్ రావు సహకారంతోనే ట్యాపింగ్ చేశాం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను ట్యాప్ చేశాం. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసి.. ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ అధికారుల సహకారంతో ముందుకు వెళ్లాం. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేశాం. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశాం.


మూడు ఉపఎన్నికల్లోనూ ట్యాపింగ్..

జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు.. మూడు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్లను ట్యాపింగ్ చేశాం. రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్‌తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా తెలుసుకున్నాం. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశాం. మాదాపూర్ SOT నారాయణ సపోర్ట్‌తో ఆపరేషన్ చేశాం. అక్టోబర్‌లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశాం.


సెటిల్మెంట్స్..

సివిల్ తగాదాలను సెటిల్ చేశాం. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్ చేశాం. రెండు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్దఎత్తున తరలించాం. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లాం. రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావును రూ.13కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనేలా చేశాం. మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టాం.


కామారెడ్డిపై స్పెషల్ ఫోకస్.. కేటీఆర్‌ను విమర్శించిన ఏ ఒక్కరినీ వదల్లే..

కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టాం. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నాటి మంత్రి కేటీఆర్‌ను విమర్శించిన ఏ ఒక్కరినీ వదల్లేదు. ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాపింగ్ చేశాం. అని భుజంగరావు తన వాంగ్మూలంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను పూసగుచ్చినట్లు వెల్లడించారు.


వెలుగులోకి కీలక వ్యక్తుల పేర్లు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ ఐటీ నవీన్ చందన్ పేరును కూడా భుజంగరావు ప్రస్తావించారు. ఎస్ఓటీ డీసీపీ నారాయణ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఎన్నికలకు ముందు రాధా కిషన్ రావు బదిలీ కావడంతో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సైబరాబాద్ ఎస్ఓటీ టీమ్‌ను సంప్రదించారు అని భుజంగరావు తెలిపారు.

‘ఆ ఎస్ఓటీ టీమ్ ద్వారా భారీగా నగదును తరలించాం. తరలించిన నగదు అంతా బీఆర్ఎస్ నేతలకు పోలీసులు స్వయంగా అందజేశారు. రాధా కిషన్ బదిలీ తర్వాత కొత్తగా వచ్చిన టాస్క్‌ఫోర్స్ డీసీపీకి మరికొన్ని ఆదేశాలు జారీ చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ నికిత పంత్ బీఆర్ఎస్ నేతల ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో ప్రభాకర్ రావు టీమ్ ఎస్ఓటీని ఆశ్రయించింది. ఓ న్యూస్ పేపర్ యజమాని.. మరో న్యూస్ ఛానెల్ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు కీలక వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశాం. ప్రభావకర్ రావుతో పాటు.. మాజీ ఇంటెలిజెన్స్ ఐటీ నవీన్ చంద్ ఇచ్చిన అత్యాధునిక పరికరాలతో మరింత మెరుగ్గా ఫోన్ ట్యాపింగ్ చేశాం’ అని భుజంగరాలు వెల్లడించారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 02:22 PM