Home » Tenth Exams
గుండెపోట్లు విద్యార్థులను సైతం వెంటాడుతున్నాయి. పరీక్షల సమయం కావడంతో తీవ్రమైన ఒత్తిడి కారణంగానో లేదంటే నిద్రలేమి కారణమో తెలియదు కానీ పదో తరగతి విద్యార్థిని పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్ర పాడు గ్రామంలో జరిగింది.
Andhrapradesh: ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు పరీక్ష జరుగనుంది. నేటి నుంచి ఈనెల 30వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 7,25,620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది, రీఎన్‌రోల్ అయినవారు 1,02,528 మంది ఉన్నారు.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.