Heart Attack: గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి
ABN , Publish Date - Mar 19 , 2024 | 10:09 AM
గుండెపోట్లు విద్యార్థులను సైతం వెంటాడుతున్నాయి. పరీక్షల సమయం కావడంతో తీవ్రమైన ఒత్తిడి కారణంగానో లేదంటే నిద్రలేమి కారణమో తెలియదు కానీ పదో తరగతి విద్యార్థిని పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్ర పాడు గ్రామంలో జరిగింది.
కడప: గుండెపోట్లు విద్యార్థులను సైతం వెంటాడుతున్నాయి. పరీక్షల సమయం కావడంతో తీవ్రమైన ఒత్తిడి కారణంగానో లేదంటే నిద్రలేమి కారణమో తెలియదు కానీ పదో తరగతి విద్యార్థిని పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన కడప (Kadapa) జిల్లా రాజుపాలెం మండలం కొర్ర పాడు గ్రామంలో జరిగింది. లిఖిత అనే విద్యార్థిని పదో తరగతి (10th Class) పరీక్షకు ప్రిపేర్ అవుతుండగా గుండెపోటు వచ్చింది. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థినిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే లిఖితను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని ధృవీకరించారు. లిఖిత మృతితో ఆమె ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి.
YS Family: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా వైఎస్ ఫ్యామిలీ ఫైట్..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.