Home » TG Politics
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా దీన్ని సేకరించింది.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రక్షాళన చేస్తామని, అభివృద్ధికి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2004 నుంచి 2014 వరకు హాస్టళ్లలో చదివే విద్యార్థులకు హెల్త్ కార్డులు ఉండేవని, ప్రతి నెలా వైద్యులు వచ్చి వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, కార్డులో రాసే వారని గుర్తుచేశారు.
: బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమని, పార్టీ మారిన పోచారం శ్రీనివా్‌సరెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కరప్షన్, కలెక్షన్ కాంగ్రెస్ విధానమని మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. హరీష్‌రావు పని విధానాన్ని తప్పు పట్టే నైతిక అర్హతా పొన్నం ప్రభాకర్‌కు లేదని మండిపడ్డారు.
ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్) నుంచి బెంగళూరుకు హాష్ ఆయిల్(Hash oil) స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్ట్ చేశారు. వారి నుంచి 13.5 కేజీల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.14కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ఖనిజాల అన్వేషణ(ఎక్స్‌ప్లోరేషన్)లో ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలోని అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో 6వ ఎన్‌ఎమ్‌ఈటీ(నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్) గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది.
కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చాలా వెనుకబడ్డ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని తెలిపారు. డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాగునీటి ప్రాజెక్టు పనులపై ఆదివారం నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అదేశించారు. వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తన విస్తరణ ప్రణాళికను ఈ నెల 14న ప్రారంభించనుంది. ఈ మేరకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ నెల 5న న్యూజెర్సీలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈవో రవికుమార్‌తో సమావేశమైన విషయం తెలిసిందే.
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు, పౌరుషం ఉంటే ITIR మంజూరు చేయించాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ITIR శంకుస్థాపన చేయించి బీజేపీ నేతలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.