Home » Tirumala Laddu
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలోని యాగ శాలలో అర్చకులు హోమం నిర్వహించనున్నారు. రేపటి రోజున రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని నిర్వహించనున్నారు.
తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ తయారీకి అవసరమైన నెయ్యితో పాటు, ఇతర పాల ఉత్పత్తులను విజయ డెయిరీ తరఫున సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పేర్కొంది.
శ్రీవారి భక్తులు పవిత్ర ప్రసాదంగా భావించే లడ్డూను అపవిత్రం చేశారంటూ తిరుపతిలో శనివారం ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు.
తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అని చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై సీఎంకు టీటీడీ ఈవో శ్యామలరావు నివేదిక ఇచ్చారు. ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.
ఏడుకొండలవాడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల లడ్డూను అపవిత్రం చేయడమంటే హిందువులు ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది క్షమార్హం ఎంత మాత్రం కాదని చెప్పారు.
కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. గవర్నర్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె..
తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిపారన్న ప్రచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న వేళ.. ఈ సీన్లోకి అమూల్ కంపెనీ ప్రవేశించింది.
తిరుపతిలో లడ్డూ వివాదంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు స్పందిస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ స్పందించారు. టీటీడీకి విజయ డైరీ నుంచి పాల ఉత్పత్తులు అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి మహా ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది.