Share News

Tirumala Laddu: సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో నివేదిక.. ఏం ఉందంటే..

ABN , Publish Date - Sep 21 , 2024 | 09:19 PM

తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అని చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై సీఎంకు టీటీడీ ఈవో శ్యామలరావు నివేదిక ఇచ్చారు. ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.

 Tirumala Laddu: సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో నివేదిక.. ఏం ఉందంటే..
CM Chandrababu Naidu

అమరావతి: తిరుమల అంశంపై మంత్రులు, అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయంలో ఇవాళ(శనివారం) సమీక్ష నిర్వహించారు. లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై సీఎంకు టీటీడీ ఈవో శ్యామలరావు నివేదిక ఇచ్చారు. ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.


ALSO Read: Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..

మరింత సమాచారాన్ని రేపు(ఆదివారం) టీటీడీ అధికారులు సీఎం చంద్రబాబుకు అందజేయనున్నారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణ విషయంలో వచ్చిన సూచనలను ఈవో వివరించారు. నేడు ఆగమ సలహాదారులు, అర్చకులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన సూచనల గురించి తెలిపారు.


ALSO Read: Srisaila Devasthanam: వైసీపీ హయాంలో అంతా మాయ..

మరింత విస్తృత సంప్రదింపుల తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. తిరుమల పవిత్ర కాపాడే విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.


జగన్ రెడ్డి మొత్తం వ్యవస్థలను నాశనం చేశారు: మంత్రి అచ్చెన్నాయుడు

Minister-Atchannaidu.jpg

శ్రీకాకుళం: ఏడుకొండల వెంకటేశ్వరస్వామికి దేశంలో, ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వేంకటేశ్వర స్వామిని అందరూ మొక్కు తారని చెప్పారు. మూడు రోజుల నుంచి తనకు నిద్ర పట్టడం లేదని అన్నారు. ఆ పవిత్ర వెంకటేశ్వర స్వామి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారని తెలిసినప్పటి నుంచి ఎంతో మంది భక్తులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. దానిని చంద్రబాబు నాయుడు బయటపెడితే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


వైసీపీ నేతలు దేవుడిని కూడా వదల్లేదు..

చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారని అన్నారు. జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి 320 రూపాయలకు కిలో నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా...? అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. నార్మల్ క్వాలిటీ నెయ్యి కావాలన్నా మినిమం రూ. 800 అవుతుందని అన్నారు. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి కొని పవిత్ర వెంకటేశ్వర స్వామి లడ్డూలు తయారు చేస్తారా అని నిలదీశారు. ఆ నెయ్యిని టెస్ట్ చేయిస్తే జంతువుల కొవ్వు ఉంది అని తేలిందన్నారు. అయినా ఇష్టం వచ్చినట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి మొత్తం వ్యవస్థలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. చివరకు దేవుడిని కూడా వదల్లేదని చెప్పారు. ఇవన్నీ తలుచుకుంటే భయమేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Visakha: రెచ్చిపోయిన కామాంధుడు.. భీమిలిలో మరో దారుణ ఘటన..

AP Politics: జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. పవన్ సమక్షంలో చేరికకు ముహుర్తం ఫిక్స్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News Click Here

Updated Date - Sep 21 , 2024 | 10:26 PM