Share News

CM Chandrababu: ఆనాడు వైఎస్.. తర్వాత జగన్.. సీఎం చంద్రబాబు నిప్పులు

ABN , Publish Date - Sep 22 , 2024 | 07:50 PM

రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను జగన్ మార్చారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు . దివంగ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలను 2కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామని చెప్పారు. తనకు వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచీ ఎంతో నమ్మకమని సీఎం చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu: ఆనాడు వైఎస్.. తర్వాత జగన్.. సీఎం చంద్రబాబు నిప్పులు

అమరావతి: ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటి వరకూ పాలకులెవ్వరూ తిరుమల పవిత్రత దెబ్బతీసే సాహసం చేయలేదని అన్నారు. ఏపీ సచివాలయంలో ఇవాళ(ఆదివారం) సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎందరికో స్పూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో ఐదేళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని చంద్రబాబు ఆరోపించారు.


రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారని ధ్వజమెత్తారు . దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలను 2కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామని అన్నారు. తనకు వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచీ ఎంతో నమ్మకమని తెలిపారు. అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడటం స్వామి వారు చేసిన అద్భుతమే తప్పా, ఆ బ్లాస్ట్‌లో ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని చెప్పారు. ఎవరి అకౌంట్లు ఎప్పటికప్పుడు స్వామి వారు సెటిల్ చేస్తారని... ఆయన మహత్యం అది అని సీఎం చంద్రబాబు తెలిపారు.


టీటీడీ ప్రసాదం ఒక మంచి వాసనతో ఉంటుందని అన్నారు. తిరుమల వంటలు రుచికరంగా ఉంటాయని చెప్పారు. తిరుమల లడ్డూకు చాలా డిమాండ్ ఉంటుందని వివరించారు. ఒక్కో లడ్డూకు 40 గ్రాముల ఆవునెయ్యి వాడతారని సీఎం చంద్రబాబు అన్నారు. స్వామి వారి ప్రసాదాన్నిఎవరూ కూడా కాపీ చేయడానికి వీలు లేదని చెప్పారు. అలాంటి ప్రత్యేకత ఉండే వేంకటేశ్వర స్వామి దగ్గర వైసీపీ అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కొండపై వ్యాపారాలు చేశారని ఆరోపించారు. అన్యమతస్తులను టీటీడీ చైర్మన్‌గా చేశారని అన్నారు. రాజకీయ కేంద్రంగా టీటీడీని వాడుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.


తిరుమల లడ్డూ నాణ్యత, సువాసనలో ఎంతో విశిష్టత ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వామి వారి మహత్యం ఉంది కాబట్టే ఎంతో మంది లడ్డూని కాపీరైట్ చేయాలనుకున్నా చేయలేకపోయారని అన్నారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డూకి వాడే పదార్థాలకు రివర్స్ టెండరింగ్ పెట్టి నాణ్యత దెబ్బతీశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నాసిరకం వారికి గేట్లు తెరిచినట్లుగా రివర్స్ టెండరింగ్ నిబంధనలు మార్చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఫలితంగా ప్రధాన సంస్థలు ఏవీ టెండర్‌లో పాల్గొనలేక పోయాయని సీఎం చంద్రబాబు తెలిపారు.


అలాంటిది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ ప్రతిష్టను దెబ్బతీశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ట్రస్టు బోర్డుల నియామకాలు ఓ గ్యాంబ్లింగ్‌గా మార్చేశారని చెప్పారు. ఇష్టానుసారంగా వీఐపీ టిక్కెట్లు అమ్ముకున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. కొండపై వ్యాపారాలు చేశారని అన్నారు. అన్యమతస్తులను టీటీడీ చైర్మన్‌గా చేశారని చెప్పారు. రాజకీయ కేంద్రంగా టీటీడీని వాడుకున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తిరుమల అన్నదానంలో భోజనం చేస్తేనే ఓ ప్రత్యేక అనుభూతి కలిగేలా కూటమి ప్రభుత్వంలో కార్యక్రమాలు చేపట్టామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Sep 22 , 2024 | 08:06 PM