Home » Tirumala Tirupathi
కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశుడి వద్ద లెక్కలేనంత బంగారు రాశులు, ధన రాశులు ఉన్నాయి. అందుకే ఆయన్ను అత్యంత సంపన్న దేవుడుగా భక్తులు కొలుస్తారు. వజ్ర, వైఢూర్యాలతో నిండు అలంకరణతో సుందరరూపుడై భక్తులకు దర్శనిస్తుంటాడు శ్రీవారు. అలాంటి శ్రీవారి సన్నిధిలో ఒంటినిండా దగదగ మెరిసే బంగారు నగలు ధరించి.. అందరినీ విస్తుపోయేలా చేశాడు ఓ భక్తుడు.
తిరుమల(Tirumala) అలిపిరి నడక దారిలో వన్యమృగాల సంచారం పెరగడం.. మనుషులపై దాడులు పెరుగుతుండటంతో నడకదారి భక్తుల భద్రతా చర్యలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
Andhrapradesh: జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.
Andhrapradesh: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం ఇవాళ (గురువారం) 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న స్వామివారిని 57,880 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఇవాళ (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) స్వామివారిని 65,887 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు (గురువారం) స్వల్పంగానే ఉంది. వీక్ డేస్ కావడంతో భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కేవలం 2 కంపార్ట్మెంట్లలో మాత్రమే వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి నేడు టోకెన్ లేని భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 66,915 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన కోటాను నేడు విడుదల చేయనుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను సైతం విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారు నేడు ఎక్కడా ఆగే పని లేదు. ఇవాళ తిరుమల భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి వుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జనవరి 22న అయోధ్య( Ayodhya)లోని రామ మందిర(ram temple) ప్రతిష్ఠాపనకు లక్ష లడ్డూ(Tirupati laddus)లను పంపిణీ చేయనున్నట్లు శుక్రవారం తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది.