Share News

మహత్తరం, మనోహరం పురాణపండ అక్షరం! బొల్లినేనికి ప్రశంసల వెల్లువ

ABN , Publish Date - Jun 29 , 2024 | 12:01 AM

అమోఘమైన తపశ్శక్తితో మన ఋషులందించిన మహత్తరమైన వేద సంపదను అనేక సత్యాలుగా స్తోత్ర, కథా అంశాలతో ఎన్నో తేజస్సులుగా అందిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తిరుమల శ్రీనివాసుని ఏకాగ్రంగా ఆరాధించడంవల్లనే అమృతశక్తుల అక్షర భారతులను ఎన్నో అందించగలుగుతున్నారని.. అలాగే అనతికాలంలోనే అనేక క్షేత్రాలకు, వేలకొలది భక్తులకు ఈ స్తోత్రరాజాలను సమర్పిస్తున్న కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య ధార్మిక సేవాసామర్ధ్యం ఆదర్శప్రాయమని తిరుమల, తిరుపతి ఆలయాలకు చెందిన అనేకమంది అర్చకులు, వేదపండితులు అభినందనలు వర్షిస్తున్నారు.

మహత్తరం, మనోహరం పురాణపండ అక్షరం! బొల్లినేనికి ప్రశంసల వెల్లువ

తిరుమల, జూన్ 28: అమోఘమైన తపశ్శక్తితో మన ఋషులందించిన మహత్తరమైన వేద సంపదను అనేక సత్యాలుగా స్తోత్ర, కథా అంశాలతో ఎన్నో తేజస్సులుగా అందిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తిరుమల శ్రీనివాసుని ఏకాగ్రంగా ఆరాధించడంవల్లనే అమృతశక్తుల అక్షర భారతులను ఎన్నో అందించగలుగుతున్నారని తిరుమల మహాక్షేత్ర ప్రధాన అర్చకులు ఏ. వేణుగోపాల దీక్షితులు మంగళాశాసనం చేశారు.

అనతికాలంలోనే అనేక క్షేత్రాలకు, వేలకొలది భక్తులకు ఈ స్తోత్రరాజాలను సమర్పిస్తున్న కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య ధార్మిక సేవాసామర్ధ్యం ఆదర్శప్రాయమని, అభినందనీయమని తిరుమల, తిరుపతి ఆలయాలకు చెందిన అనేకమంది అర్చకులు, వేదపండితులు అభినందనలు వర్షిస్తున్నారు.

Pic-1.jpg

సర్వ దేవతాత్మకమైన అనుగ్రహం నిండి ఉన్న పురాణపండ శ్రీనివాస్ ‘శ్రీమాలిక’ మంత్రం పరిమళం ఎన్నో, ఎన్నెన్నో పునర్ముద్రణలకు నోచుకోవడం మామూలు విషయం కాదని, ఈ ప్రచురణాలను సంస్కార సంపన్నతతో అందిస్తున్న బొల్లినేని కృష్ణయ్య నిస్వార్ధత వెనుక ఉన్న పవిత్రతను మరొక ముఖ్య అర్చక ప్రముఖులు గోవిందరాజ దీక్షితులు ప్రశంసించారు.

యాదాద్రిలో, వేంకటాద్రిలో, ఇంద్రకీలాద్రిలో.. ఇలా ఎన్నో మహా మంగళ క్షేత్రాల భక్తగణాలకు ఈ అక్షరసంపదను అటు అందంగా, ఇటు భాషా సంస్కారంతో, మరోవైపు వ్యాపార కనికట్టులు లేకుండా ఉచితంగా ఇవ్వడమనేది కేవలం దైవబలం వల్లనే సాధ్యమవుతోందని నిర్మొహమాటంగా చెప్పాలని తిరుమల ఆలయ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం ఎస్వీబీసీ ఉద్యోగ బృందాలకు వివరించి ఈ గ్రంధాలను బహూకరించడం ఒక విశేషంగానే చెప్పాలి.

Chaganti-Koteswara-Rao.jpg

తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ దేశాలలో లక్షలమంది తెలుగువారు అభిమానులున్న విఖ్యాత ప్రవచనకర్త, మహాసరస్వతీపుత్రులు చాగంటి కోటేశ్వర రావు గతమాసంలో మొదటివారం మరియు చివరివారంలలో బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో.. దేవస్థానం అడిషనల్ కమీషనర్ కె.ఎస్. రామారావు సమర్ధవంతమైన పర్యవేక్షణలో రచయిత పురాణపండ శ్రీనివాస్ రెండు అమోఘ గ్రంధాలను ఆవిష్కరిస్తూ.. చిరంజీవి పురాణపండ శ్రీనివాస్ అమ్మవారి మహోపాసన చెయ్యడం వల్లనే ఇంతటి సమర్థతతో వేద విజ్ఞానరూప చైతన్యాన్ని అందించగలుగుతున్నారని, ఇది సాధారణ విషయం కాదని, ప్రార్ధనా శక్తుల మహాబలముంటేనే ఈ అపురూపాలు మనకి చేరుతున్నాయని ఆశీస్సులు వర్షించారు.

Pic-2.jpg

తిరుమల, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, యాదాద్రి.. హైదరాబాద్‌లోని ఎన్నో ఎన్నెన్నో ఆలయాలు.. ఇలా ఎన్నో చోట్ల భక్తకోటికి ఎంతో ప్రయోజనకర అక్షర శక్తుల్ని సౌజన్య హృదయంతో అందిస్తున్న బొల్లినేని కృష్ణయ్య ధన్యచరితులని తిరుమల వేదపాఠశాల వేదపండితులు సైతం గొంతెత్తడం కేవలం శ్రీనివాసుని అనుగ్రహమే.

Pic-3.jpg

సనాతనధర్మమంటే ఏమిటో తెలియకుండానే కొందరు ప్రబుద్ధులు కీర్తి కోసం మాత్రమే ఏవో బుక్కులు రాసి మీడియా చుట్టూ తిరుగుతున్న ఈరోజుల్లో.. శాస్త్ర ప్రమాణాలతో, సాధికారికంగా జ్ఞానసమృద్ధిని అక్షరకలశాలుగా అందిస్తున్న శ్రీనివాస్ కృషి ఎన్నో పునర్ముద్రణలకు నోచుకోవడం కన్నుల ఎదుటే కనిపిస్తున్న కఠోర సత్యం.

Pic-4.jpg

పురాణపండ శ్రీనివాస్ పవిత్ర సంకల్పం ప్రక్కనే ఉన్న నిబ్బరం, నిబద్ధత, కఠోరపరిశ్రమ, భాషా సౌందర్యంతో ప్రతీ ధార్మిక గ్రంధం ఒక గెలుపుగా, ఒక యజ్ఞ భావనల ఘనతగా , ఒక శ్రమోపాసకుని దైవోపాసనగా దర్శనమిస్తోందని అనేక సందర్భాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు కెవి రమణాచారి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, జి. కిషన్ రావు స్ఫుటంగా పేర్కొన్న విషయం మేధో సమాజానికి ఎరుకే.

Pic-5.jpg

పుస్తకాన్నెంతో మురిపెంగా చూసుకునే పురాణపండ శ్రీనివాస్‌కి సపోర్ట్ ఇస్తున్న బొల్లినేని కృష్ణయ్య వంటి రాజకీయ పారిశ్రామిక యోధునికి జేజేలు పలికి కృతజ్ఞతలు చెప్పాలని బెజవాడ దుర్గమ్మ ఆలయ పండిత బృందం ఏక స్వరంతో చెప్పడాన్ని మనమంతా సమర్ధించాలని భక్త బృందాలు చప్పట్లు చరచడం విశేషం.

Pic-6.jpg

గత రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాలలో పురాణపండ శ్రీనివాస్ శ్రీమాలిక, జయ జయోస్తు, నారసింహో ... ఉగ్రసింహో, నమో నమస్తే, ఉగ్రం .. వీరం, సౌభాగ్య, శంభో మహాదేవ , బంగారు నీరాజనం.. వంటి గ్రంధాల వెలుగులు చేస్తున్న సందడి అంతా ఇంతాకాదనే చెప్పాలి.

Updated Date - Jun 29 , 2024 | 12:19 AM