Home » Tirumala Tirupathi
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. సర్వదర్శనంతో పాటు రూ.300, బ్రేక్ దర్శనం అందుబాటులో ఉంటుంది. వీఐపీలు, వీవీఐపీల సీఫార్సు లేఖలపై ప్రత్యేక దర్శన సదుపాయం కల్పిస్తారు.
Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడిని మంత్రి టీజీ భరత్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద బ్రాండ్ అని అన్నారు. రాష్ట్రానికి పెద్ద..పెద్ద.. పరిశ్రమలు వస్తాయని నమ్మకం ఉందన్నారు.
నకిలీ టికెట్లతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న అక్రమం ఒకటి టీటీడీలో బయటపడింది. ట్రావెల్స్, దళారీలతో కుమ్మక్కైన ఓ టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ చర్యకు పాల్పడుతున్నట్టు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో స్వామివారి దర్శనానికి నకిలీ టికెట్లు(Fake tickets) అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. టూరిజం శాఖ ముసుగులో కొంత కాలంగా నకిలీ టికెట్ల దందా సాగుతోంది. ప్రతి నిత్యం 30నుంచి 40మంది భక్తులను టికెట్లు లేకుండానే దర్శనానికి దళారీలు అనుమతిస్తున్నారు.
టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం (ఈరోజు)మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. క్యూ లైనల్లో భక్తులకు టీటీడీ అన్నపానియాలను నిరంతరంగా పంపిణీ చేస్తుందని తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలకు తమ సిఫారసు లేఖలనూ అనుమతించాలంటూ తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి టీటీడీపై ఒత్తిడి పెరుగుతోంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం శాస్ర్తోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేశాక హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.
ప్రముఖ హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులు బుధవారం కాలినడకన తిరుమలకు వచ్చారు.