Share News

TTD: రేపు టీటీడీ బోర్డు సమావేశం

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:18 AM

తిరుమలలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది. అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

TTD: రేపు టీటీడీ బోర్డు సమావేశం

తిరుమల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది. అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడంతో పాటు ఇప్పటికే సిద్ధం చేసిన అజెండాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సీఎం చంద్రబాబు బోర్డుకు, అలాగే సభ్యులకు చేసిన పలు సూచనలపై కూడా చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం నూతన ట్రస్టును ఏర్పాటు చేయాలనే సూచనకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అలిపిరిలో కొండలకు వెంబడి ఉన్న ప్రాంతాన్ని టెంపుల్‌ కారిడార్‌గా చేసే అంశంపైనా చర్చించనున్నారు. అన్యమత ఉద్యోగుల తరలింపు, శ్రీవారి ఆస్తుల పరిరక్షణ వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి.

Updated Date - Mar 23 , 2025 | 01:18 AM