Share News

AP NEWS: తిరుమలకు అన్నాలెజినోవా... అసలు కారణమిదే..

ABN , Publish Date - Apr 13 , 2025 | 10:44 AM

Annalejinova: సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడి త్వరగా కోలుకున్నారు. బాబు కోలుకోవడంతో పవన్ భార్య అన్నాలెజినోవా తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకోనున్నారు.

AP NEWS: తిరుమలకు అన్నాలెజినోవా... అసలు కారణమిదే..
Annalejinova

తిరుమల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) సతీమణి అన్నాలెజినోవా (Anna lezhneva) ఇవాళ(ఆదివారం) తిరుమల వెళ్లనున్నారు. రేపు(సోమవారం) ఉదయం శ్రీవారిని ఆమె దర్శించుకోనున్నారు. శ్రీవారికి అన్నాలెజినోవా తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి అన్నాలెజినోవా మొక్కులు చెల్లించుకోనున్నారు.


అసలు ఏం జరిగిందంటే..

సింగపూర్‌లో ఏప్రిల్ 8వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డారు. సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీంలోని రివర్ వ్యాలీ రోడ్డులో గల మూడంతస్తుల భవనంలో టమాటో కుకింగ్ స్కూల్ ఉంది. ఈ పాఠశాలలోనే మార్క్ శంకర్ చదువుతున్నాడు. ఈ స్కూలులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో మార్క్‌ శంకర్‌తో పాటు కొంతమంది విద్యార్థులు గాయల బారిన పడ్డారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మార్క్ శంకర్‌ను కాపాడారు. అగ్ని ప్రమాదం జరగడంతో స్కూలులో పొగలు దట్టంగా వ్యాపించాయి. దీంతో మార్క్ శంకర్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. అలాగే ప్రమాదం వల్ల మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.


బాబును ఈ ప్రమాదం నుంచి రక్షించి సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్‌కు సమాచారం అందించారు. ఈ సమయంలో పవన్ అల్లూరి జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. పర్యటన ముగించుకున్న అనంతరం విశాఖపట్నం నుంచి సింగపూర్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు మెగాస్టార్ కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. ఆస్పత్రికి చేరుకుని అక్కడ మార్క్‌శంకర్‌ను పవన్ పరామర్శించారు. బాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ సింగపూర్‌ ఆస్పత్రిలో ఉన్నారు. బాబు కోలుకున్న అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మార్క్ శంకర్‌ను అగ్ని ప్రమాదం నుంచి కాపాడిన వారికి పవన్ ప్రత్యేకంగా అభినందించారు. వారికి సన్మానం చేశారు. భార్య అన్నాలెజినోవా కుమారుడు మార్క్‌ శంకర్‌తో తిరిగి పవన్ కల్యాణ్ భారతదేశానికి వచ్చారు. సింగపూర్ ప్రభుత్వం కూడా మార్క్ శంకర్‌ను కాపాడిన భారత వలస కార్మికులను సన్మానించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపి మంచి మనస్సు చాటుకుంది. మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా కోరుకున్నారు. పవన్ అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మార్క్ శంకర్ కోలుకోవడంతో పవన్ కల్యాణ్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.


మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ ఏమన్నారంటే..

pawan.jpg

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. సింగపూర్‌లో తన కుమారుడు మార్క్ శంకర్ సమ్మర్ క్యాంప్‌లో ఉన్నారని.. ఆ సమయంలో జరిగిన దురదృష్టకర అగ్నిప్రమాదం తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రార్థనలు, ఆందోళన, మద్దతు తనను ఉక్కిరిబిక్కిరి చేశాయని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ సభ్యులు, స్నేహితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మద్దతుదారులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. మార్క్ శంకర్ ఆరోగ్యం బాగుందని.. బాగా కోలుకుంటున్నారని చెప్పారు. అందరికీ హృదయపూర్వక సందేశాలు, తమకు నిజంగా బలాన్నిచ్చాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


అగ్నిప్రమాద సంఘటన సమయంలో సత్వరం స్పందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమన్వయంతో సింగపూర్ అధికారులు అందించిన సహాయం, క్లిష్ట సమయంలో చాలా ధైర్యాన్నిచ్చిందని అన్నారు. తాను ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతంలో 'అడవి తల్లి బాట' కార్యక్రమంలో పాల్గొంటూ, ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యకలాపాలను ప్రారంభిస్తున్నప్పుడు, తనకు బాధాకరమైన వార్త అందిందని తెలిపారు. తన కొడుకు, ప్రభావితమైన ఇతర పిల్లల కోసం మీరు సకాలంలో స్పందించడం తమ కుటుంబానికి అపారమైన బలాన్ని, ఉపశమనాన్ని ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.


ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాల (PVTGs) జీవితాలను ఉద్ధరించడానికి మీ దార్శనిక నిబద్ధతకు అడవి తల్లి బాట ఎంతో ఉపయోగపడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. అన్ని వర్గాల అవసరాలను తీర్చడానికి ప్రధాని మోదీ తీసుకున్న అనేక చర్యల్లో ఇది ఒకటని.. వారి జీవితాలను మార్చడానికి మోదీ చేసే విస్తృత ప్రయత్నాల్లో ఇది కీలకమైన భాగమని అన్నారు. PM JANMAN, PMGSY, MGNREGSల మద్దతుతో, ఈ చొరవ రూ.1,005 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 1,069 కి.మీ. రోడ్లను నిర్మిస్తుందని తెలిపారు. 601 PVTG ఆవాసాల్లో కనెక్టివిటీ సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ రవాణాను మెరుగుపరుస్తుందని, పర్యాటకానికి మద్దతు ఇస్తుందని, సకాలంలో వైద్య సదుపాయాన్ని అందిస్తుందని చెప్పారు.. "డోలీ" కష్టాలకు ముగింపు పలుకుతుందని అన్నారు. తన కుటుంబానికి అపారమైన బలాన్ని ఇచ్చిన అందరికీ మరోసారి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Nara Lokesh: సొంత నియోజకవర్గంలో మరో హామీకి నారా లోకేష్ శ్రీకారం

AP News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Birthday Celebrations: 20 నుంచి కర్నూలులో చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 13 , 2025 | 11:41 AM