Home » TMC
తమ నేతను తీసుకెళ్తున్నారన్న కోపంతో ఓ గ్రామస్థులు ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన ఘటన పశ్చిమబెంగాల్ లో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ 24 పరగణాల జిల్లాకి చెందిన టీఎంసీ(TMC) నాయకుడు షాజహాన్ షేక్(రేషన్ కుంభకోణం)(Ration Scam) విచారణనిమిత్తం ఈడీ అధికారులు గ్రామానికి వచ్చారు. అనంతరం ఆయన్ని ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని కోరుతూ.. తమ కారులో తీసుకెళ్లారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత మహువ మొయిత్రాపై లోక్సభ బహిష్కరణ వేటు పడిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్పై లోక్సభ సెక్రటరీ జనరల్కు సుప్రీంకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది. ముూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ నేత మహువా మొయిత్రా అధికార నివాసం కూడా ఖాళీ చేయాల్సి రావడంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు వాయిదా వేసింది. పిటిషన్పై 'స్టే' ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను 2024 జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.
డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్సభ ఆమోదించింది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించాలంటూ పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయడం, నివేదికను లోక్సభలో శుక్రవారంనాడు ప్రవేశపెట్టడంపై ఆమె ఘాటుగా స్పందించారు. ''ఇక మహాభారత యుద్ధాన్ని చూస్తారు'' అంటూ వ్యాఖ్యానించారు.
డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై పార్లమెంటు నైతిక విలువల కమిటీ నివేదక శుక్రవారంనాడు లోక్సభ ముందుకు వచ్చింది. బీజపీ ఎంపీ, ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయ్ సోంకర్ ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. టీఎంసీ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారానే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ ఎంపీ మహువా మెయిత్ర చట్టూ ఉచ్చు బిగుస్తోంది. లోక్పాల్ ఆదేశాలపై ఆమెపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది.
డబ్బులు తీసుకుని ప్రశ్నలు వేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై ముసాయిదా నివేదికను రూపొందించేందుకు జరగాల్సిన లోక్సభ ఎథిక్స్ కమిటీ సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 7న కమిటీ సమావేశం కావాల్సి ఉంది.
డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పై చర్యకు లోక్సభ ఎథిక్స్ కమిటీ కమిటీ నవంబర్ 7న కీలక సమావేశం జరుపనుంది.
ఉత్తర భారతంలో ఇప్పుడు రెండే రెండు అంశాలు బాగా హైలైట్ అవుతున్నాయి. ఒకటి.. ఎన్నికలు, రెండోది.. మహువా మోయిత్రాకు సంబంధించిన ‘ప్రశ్నకు డబ్బు’ కేసు. మరీ ముఖ్యంగా.. మహువా మోయిత్రా వ్యవహారం...