Home » TPCC Chief
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది లేకుండానే ప్రజల్లోకి వెళుతున్నట్లు తెలిసింది. బుధవారం నుంచి రేవంత్‌కు భద్రతగా గన్మెన్లు వెళ్లడం లేదని సమాచారం. గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మహబూబ్‌నగర్ పోలీసుల్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతా. 100 రోజుల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి గుడ్డలిప్పదీస్తాం. అసలు మిత్తితోని చెల్లిస్తాం’’ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.
24 గంటల ఉచిత విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.16,500 కోట్ల ఖర్చు చూపిస్తోంది. కానీ 24 గంటలు ఇవ్వకుండా 8 నుంచి 11 గంటలే ఇస్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కో విధంగా విద్యుత్ ఇస్తున్నారు. ఆ లెక్కల రూ.8 వేల కోట్ల చిల్లర మాత్రమే విద్యుత్ కొనుగోలుకు ఖర్చవుతుంది. ప్రతి సంవత్సరం రూ.16 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చులు చూపింది. మరి దాదాపు రూ.8 వేల కోట్లు ఎక్కడికి పోతున్నాయని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యుత్‌పై అసత్య ప్రచారం మానుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవుపలికారు.
ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
హైదరాబాద్: ఎన్నికల్లో వచ్చిన మార్పులు, సాంకేతికతను బీజేపీ, బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందని.. దీన్ని కాంగ్రెస్ అధిగమించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుర్చీ కదులుతుందనే కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని.. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ బహిష్కృతనేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లోకి పొంగులేటి దాదాపు ఖరారు కావడంతో పలు అంశాలపై చర్చించనున్నారు. పొంగులేటి తో పాటు ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చిన తరువాత పొంగులేటి చేరిక ఉండే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి భేటీ తరువాత అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బినామీ యాక్టు పర్ఫెక్ట్గా అమలవుతోందన్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయదుందుబి మోగిస్తోంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.