Home » TPCC
కాంగ్రెస్ పార్టీ(INC) 3 రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సదరు జాబితా సిద్ధమైందని శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయంలోపు పేర్లను ప్రకటిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జంట నగరాలలోని చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని టీపీసీసీ కార్మిక విభాగం కార్యదర్శి వీవీ రవీంద్రనాథ్ నాయుడు(VV Rabindranath Naidu) కోరారు.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు..? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవీకాలం అయిపోయినంత వరకూ నడిచిన.. ఇంకా నడుస్తున్న ఏకైక చర్చ. ఒకరా ఇద్దరా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయ్..! అదిగో అధికారిక ప్రకటన వచ్చేస్తోంది.. ఇదిగో ఈయనే కన్ఫామ్ అయ్యారని లెక్కలేనన్ని వార్తలు.. అంతకుమించి పుకార్లు షికార్లు చేశాయ్..! ఆశావహులు అయితే ఈసారైనా అదృష్టం వరించకపోదా..? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి..
సంవిధాన్ హత్యా దివస్(Samvidhan Hatya Divas)గా జులై 25ను ప్రకటించడం చూస్తుంటే కాంగ్రెస్ను చూసి బీజేపీ ఏ విధంగా భయపడుతుంతో అర్థం చేసుకోవచ్చని TPCC సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్(TPCC Senior Vice President Niranjan) అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానిగా మోడీ ఎన్నికైనా.. గెలుపు మాత్రం కాంగ్రెస్దే అన్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పారు.
‘‘స్వాతంత్రోద్యమ కాలంలో దేశ ప్రజల కోసం జవహర్‌లాల్ నెహ్రూ 3,259 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. అంటే తొమ్మిదిన్నరేళ్లు ఆయన జైల్లోనే ఉన్నారు. దేశ ప్రజల సమస్యలపై పోరాటం చేసి కొన్ని గంటలైనా జైలు జీవితం గడిపిన రికార్డు.. ప్రధాని మోదీకి ఉందా?’’
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు అంశాలపైశుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించారు.
టీపీసీసీ పదవిని మహిళకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్నను ఓ విలేకరి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వద్ద ప్రస్తావించగా.. సీఎం ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. నిజమైన ప్రజా సేవకుడికి అహంకారం ఉండదంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనని అంతా భావిస్తున్నారన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారధి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీ కాలం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో టీపీసీసీ నూతన చీఫ్ నియామకంపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది.