Home » TTD
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అంశం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సోమవారం అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమలలో రెచ్చగొట్టేలా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనంటూనే నిబంధనలను ఉల్లఘించి మాట్లాడారు.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసా దానికి కల్తీ నెయ్యిని సర ఫరా చేసిన వారిని కఠి నంగా శిక్షించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశా రు.
వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్లకు నేతృత్వం వహించినవారు కాపాడారా? వాటిని అమ్మేశారా? అనే సందేహాలు భక్తులకు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
తిరుమల లడ్డూ పవిత్రత దెబ్బతిన్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ(TTD) కీలక సూచనలు చేసింది. "తిరుమల శ్రీవారి ఆలయంలోని యాగశాలలో లడ్డూ ప్రసాదాలు, నైవేద్యం పవిత్రతను పునరుద్ధరించడానికి, భక్తుల సంక్షేమానికి శాంతి హోమం ఆగమోక్తంగా జరిగింది.
తిరుమలలో కొలువైన ఆ బ్రహ్మండనాయకుడి ప్రసాదమై లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. అలాంటి వేళ ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డ్ చైర్మన్గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.
విజిలెన్స్ విచారణను ఆపేయాలని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వ్యాజ్యం దాఖలు చేశారు. తన హయాంలో ఎలాంటి తప్పులు చేయకపోతే సుబ్బారెడ్డి విచారణ వద్దని..
Andhrapradesh: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కారణంగా శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం చేపట్టిన మహాశాంతి యాగం ముగిసింది. పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం పూర్తి అయ్యింది. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమం నిర్వహించారు.
రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నామని, ముందుగా మహ శాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహణ జరుగుతుందని, చివరిగా పంచగవ్యాలతో అర్చకులు సంప్రోక్షణ నిర్వహిస్తారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
తిరుమల లడ్డ్డూప్రసాదంలో కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాల ని ఏపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్య క్షుడు పులిశ్రీనివాసులు డి మాండ్ చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వచ్చారు.