కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారిని శిక్షించాలి
ABN , Publish Date - Sep 23 , 2024 | 11:54 PM
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసా దానికి కల్తీ నెయ్యిని సర ఫరా చేసిన వారిని కఠి నంగా శిక్షించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశా రు.
కురబలకోట, సెప్టెంబరు 23: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసా దానికి కల్తీ నెయ్యిని సర ఫరా చేసిన వారిని కఠి నంగా శిక్షించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. సోమవారం మండలంలోని అంగళ్ళులో సీఐ రమేష్, ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌లకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్రయా దవ్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ప్రీతి పాత్రమైన లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును సరఫరా చేయడం హిందూ మతానికి ఆవహేళన చేయడమేనన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు గుత్తికొండ త్యాగరాజు, శంకర్‌రెడ్డి, బీజే పీ నేతలు బావాజాన, రాజారెడ్డి, నరసింహులు, చిన్నప్ప, వేణుగో పాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.