Share News

Tirumala: తిరుమలలో ముగిసిన మహా శాంతి యాగం

ABN , Publish Date - Sep 23 , 2024 | 11:55 AM

Andhrapradesh: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కారణంగా శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం చేపట్టిన మహాశాంతి యాగం ముగిసింది. పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం పూర్తి అయ్యింది. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమం నిర్వహించారు.

Tirumala: తిరుమలలో ముగిసిన మహా శాంతి యాగం
Tirumala Laddu

తిరుమల, సెప్టెంబర్ 23: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంతో అపచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో చేపట్టిన మహా శాంతియాగం ముగిసింది. పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం పూర్తి అయ్యింది. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి యాగాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహించారు. ముందుగా మహాశాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహణ జరిగింది.

Krishnarao: హైడ్రా కూల్చివేతలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు


కాగా శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్క రోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. ప్రస్తుతం మహా శాంతియాగం ముగియగా.. మరికాసేపట్లో పంచగవ్యాలతో శ్రీవారి ఆలయంతో పాటు వకుళ మాత పోటు, లడ్డు పోటు, బూందీ పోటు, ప్రసాద విక్రయశాలల్లో అర్చకులు సంప్రోక్షణ చేయనున్నారు.

200 Year Old Message: గాజు సీసాలో 200 ఏళ్ల నాటి సందేశం.. పురావస్తు శాఖ తవ్వకాల్లో లభ్యం


గత నెలలోనే సంప్రోక్షణ.. అయినప్పటికీ: ఈవో

తిరుమలలో కలకలం రేపిన కల్తీ నెయ్యి దోషాన్ని గత నెల ఆగస్టులో సంప్రోక్షణతో పోగొట్టామని, భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు వెల్లడించారు. నిన్న(ఆదివారం) రాత్రి తిరుపతిలో పద్మావతి రెస్ట్‌ హౌస్‌లో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు మోహనరంగాచార్యులు, రామకృష్ణ దీక్షితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో తెలుసో తెలియక జరిగే దోష నివారణకు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ఆగస్టులోనే ఆలయంలో అన్న ప్రసాదపోటు, లడ్డూ పోటులో సంప్రోక్షణ చేశాం. అందులోని కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను సమర్పించాం. కల్తీ నెయ్యి వలన ఏమైనా దోషాలు ఉండుంటే కూడా తొలగిపోయాయి. అయినప్పటికీ భక్తుల్లో నెలకొన్న ఆందోళన దృష్ట్యా ఆగమశాస్త్ర పండితులు, పెద్దజియ్యంగార్లను సంప్రదించిన తర్వాత సీఎం చంద్రబాబు శ్రీవారి ఆలయంలో ఒకరోజు శాంతి హోమం నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శాంతిహోమం చేస్తున్నాం. శ్రీవారి ఆలయంలోని యాగబావి వద్ద యాగశాలలో, మూడు హోమగుండాలు (వాస్తు, సభ్యం, పౌండరీక) ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా అన్ని ఆలయాల్లో పంచగవ్య ప్రోక్షణ చేయనున్నాం’’ అని ఈవో శ్యామలరావు వివరించారు.


ఇవి కూడా చదవండి..

హెచ్చరించినా మారలేదు!

Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై ‘సిట్‌’కు ఏపీ సర్కార్ ఆదేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2024 | 12:38 PM