Share News

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసిన వారిని శిక్షించాలి

ABN , Publish Date - Sep 23 , 2024 | 12:24 AM

తిరుమల లడ్డ్డూప్రసాదంలో కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాల ని ఏపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్య క్షుడు పులిశ్రీనివాసులు డి మాండ్‌ చేశారు.

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసిన వారిని శిక్షించాలి
వ్యవస్థాపక అధ్యక్షుడు పులి శ్రీనివాసులు

మదనపల్లె అర్బన, సెప్టెంబరు 22: తిరుమల లడ్డ్డూప్రసాదంలో కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాల ని ఏపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్య క్షుడు పులిశ్రీనివాసులు డి మాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ఆంజనే యస్వామి ఆలయంలో వాల్మీకి సం ఘం నేతలతో కలిసి నిరస న చేప ట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటే శ్వరస్వామి ఆలయంలో లడ్డూప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును కలపడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిందితులను శిక్షించాలని కోరారు. నాయకు లు జయసంహా, మంజు నాథ్‌, శంకర, జగన, రెడ్డిశేఖర్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

అక్రమార్కులపై కేసు నమోదు చేయండి

గుర్రంకొండ, సెప్టెంబరు 22:తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన అక్రమార్కులపై కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నాయకులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఇందులో భాగంగా బస్టాండు నుంచి పోలీస్‌ స్టేషన వరకు ర్యాలీ నిర్వహించారు. లడ్డూకు వాడే నెయ్యిని కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఐ మదురామ చంద్రుడుకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రామాంజులు, సతీష్‌, దేవిక, రాము, భరత, ఆదినారాయణ, ఆంజి, విజయ్‌కుమార్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 12:24 AM