Home » Uddhav Thackeray
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరే భద్రతను కుదించినట్టు తెలుస్తోంది. దీనిపై ముంబై పోలీసులు మాత్రం ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా కొనసాగడం లేదని, అందువల్ల ప్రోటాకాల్ ప్రకారం ఆయన సెక్యూరిటీ కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలను తొలగించామని తెలిపారు.
శివసేన వ్యవస్థాపక దినోత్సవం ఈనెల 19న పోటాపోటీగా నిర్వహించేందుకు అటు ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, ఉద్ధవ్ థాకరే సారథ్యంలో శివసేన యూబీటీ సిద్ధమవుతున్నాయి.
శివసేన ఉద్ధవ్ బాల్‌థాకరే మహిళా నేత, ఆఫీస్ బేరర్పై మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఒక కార్యక్రమంలో కొందరు మహిళలు దాడికి దిగారు. ఇంక్ చల్లి అవమానించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితురాలు, శివసేన యూబీటీ సోషల్ మీడియా కన్వీనర్ అయోధ్య పోల్ థానేలోని కల్వా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కర్ణాటకలో విద్యార్థుల పాఠ్యాంశాల నుంచి సావర్కర్, హెడ్గేవార్ పాఠాలను తొలగించడంపై మౌనంగా ఎందుకు ఉన్నారని శివసేన-యూబీటీ (Shiv Sena -UBT) నేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) నిలదీశారు. అధికారం కోసం సిద్ధాంతాలతో రాజీ పడుతున్నారని దుయ్యబట్టారు.
ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనపై బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు నలుగురు వ్యక్తుల కారణంగా ఉద్ధవ్ థాకరే శివసేనలో తీవ్ర అశాంతి నెలకొందని అన్నారు. అయితే, ఆ వ్యక్తులెవరనేది చెప్పడానికి ఆయన నిరాకరించారు.
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదలీలపై రాష్ట్రానికి అధికారులు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కేంద్రం ఆర్డినెన్స్ తేవడంపై మండిపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఇతర పార్టీల మద్దతు సమీకరిస్తున్నారు. ఇందులో భాగంగా శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాకరేను ఆయన నివాసంలో బుధవారంనాడు కలుసుకున్నారు.
ముంబై: శివసేన రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిన మరుసటి రోజే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే తమ ప్రత్యర్థి వర్గమైన ఏక్నాథ్ షిండేకు, బీజేపీకి సవాల్ విసిరారు. తాజా ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు.
మహారాష్ట్రలో మహా వికాస్ అగాడీ (MVA) ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠించేందుకు తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా ఉందని
మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) రాజీనామా చేసి ఉండకపోతే, ఆయనను ఆ పదవిలో పునఃప్రతిష్ఠించి
సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట లభించింది. శివసేన వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఏక్ నాథ్ షిండే చీఫ్ విఫ్ నియామకం చెల్లదని, అది చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్టీలో విభేదాలను పార్టీలోనే పరిష్కరించుకోవాలి తప్ప గవర్నర్ జోక్యం తగదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.