Home » Uttarakhand
ఉత్తరాఖండ్ లో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఛమోలి జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలడంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఉత్తరఖండ్‌లోని చమోలీ జిల్లాలో బుధవారం ఉదయం తీవ్ర విషాదం నెలకొంది. అలకనంద నది ఒడ్డునున్న నమామీ గంగ ప్రాజెక్ట్ సైట్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతంతో ఏకంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.
సెల్ఫీల పిచ్చితో కొందరు యువతీయువకులు చేసే పనులు ఎదుటి వారికి ఆగ్రహం కలిగిస్తుంటాయి. మరికొందరు ఇదే సెల్ఫీల పిచ్చితో చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. జంతువులతో ఫొటోలు తీసుకుంటూ కొందరు, రైలు పట్టాలపై మరికొందరు, కదులుతున్న సమయంలో..
ఉత్తర భారతం భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. యమునా నది 206 మీటర్లకు మించి, ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఢిల్లీలో రహదారులు జలమయంకావడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తున్నాయి. కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించారు.
ఉత్తర భారతం రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో సతమతమవుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలలో అసాధారణ వర్షాలు ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, హఠాత్తుగా వరదలు సంభవించడం, హైవేలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోవడం వంటివాటివల్ల జనజీవనం అతలాకుతలమవుతోంది.
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వాహనం రోడ్డు మీద నుంచి అదుపు తప్పి లోయలో పడిపోయింది. అందులో మొత్తం 11 మంది ప్రయాణీకులు ఉన్నారు.
ఆహారం రుచికరంగా ఉండాలంటే టమాటాలు తప్పనిసరి. ఇవి ఒక్కోసారి కేజీ రూ.1కి కూడా అందుబాటులో ఉంటాయి, ఇప్పుడు మాత్రం వీటి ధరను తల్చుకుంటే ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు. గతంలో ఓ కేజీ కొనేవారు ఇప్పుడు పావు కేజీతో సరిపెట్టుకుంటున్నారు. కొందరైతే అసలు ఈ ధరాభారాన్ని తట్టుకోలేక వెనుదిరిగిపోతున్నారు.
పవిత్ర కేదార్నాథ్ ఆలయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఇటీవల ఓ జంట చిత్రీకరించిన లవ్ ప్రపోజల్ వీడియోపై పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. కాగా పవిత్ర కేదర్నాథ్ ఆలయంలో కొంతమంది వీడియోలు చిత్రీకరించడం పట్ల అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీల్స్ చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.
పెళ్లి అంటే నూరేళ్ల పంట. అనేక కుటుంబాల మధ్య బంధుత్వంతోపాటు ఆత్మీయతానుబంధాలు పెనవేసుకోవడానికి నాందీవాచకం. అందుకే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకుంటారు. కొందరు పవిత్ర పుణ్య క్షేత్రాల్లో తమ వివాహం జరుపుకుంటారు. ఇక ఆది దంపతులు శివపార్వతులు పెళ్లి చేసుకున్న చోటులోనే పెళ్లి చేసుకుంటే తమ జీవితాలు ఎంతో సౌభాగ్యవంతంగా సాగుతాయనే నమ్మకం చాలా మందికి ఉంటుంది.
ప్రస్తుత సమాజంలో చాలా మంది అందరి ముందూ విలాసవంతంగా కనిపించాలనే ఉద్దేశంతో తమ స్థాయికి మించి ఖర్చు చేస్తుంటారు. గొప్పలకు పోయి చివరకు అప్పులపాలవుతుంటారు. ఇక సినీ, రాజకీయ నాయకులకు చెందిన కుటుంబ సభ్యుల జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే..