Home » Varanasi
ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న స్వామి అవిముక్తేశ్వరానంద్‌పై జ్యోతిర్మఠం ట్రస్టుకు చెందిన స్వామి శ్రీ గోవిందానంద సరస్వతి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిముక్తేశ్వరానంద్ ఒక 'నకిలీ బాబా' అని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ వత్తాసుగా ఉందని చెప్పారు.
ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించే యాత్రికులకు మరింత సులభంగా ఆలయ ప్రవేశానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు కార్డుతో ఆలయం ఆవరణలోకి ప్రవేశం కల్పించనున్నారు.
వారణాసిలోని సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) నాయకుడు, మాజీ కార్పొరేటర్ విజయ్ యాదవ్ నివాసం వద్ద ఆదివారం జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా ఆరుగురు గాయపడ్డారు.
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ(Nita Ambani ) ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ ఆహ్వాన పత్రాన్ని శివాలయంలో అందజేశారు.
గంగా మాత తనను దత్తత తీసుకుందని, తాను వారణాసివాసుల్లో ఒకరినయ్యానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎప్పటిలాగే ప్రజల కలలు, ఆంక్షాలను పండిచేందుకు తాను రేయింబవళ్లు పనిచేస్తానని చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి వారణాసి ఎంపీగా మోదీ గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలో మంగళవారంనాడు తొలిసారి పర్యటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రోజు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యాటనలో భాగంగా సాయంత్రం 4.00 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్‌కు ఆయన చేరుకుంటారు. అనంతరం వారణాసిలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద లబ్దిదారులకు 17 విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 18న వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 17వ ఇన్స్టాల్మెంట్ కింద రూ.20,000 కోట్లు విడుదల చేయదలనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. జూన్ 18వ తేదీన వారణాసిలో జరిగే రైతుల సభలో ఆయన పాల్గొనున్నారు. ఆ క్రమంలో సమ్మాన్ నిధి నుంచి 17వ విడత నిధులను ఆయన విడుదల చేయనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నారు. మోదీ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై 1,52,513 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎవరికి అంతుపట్టడంలేదు. తుది ఫలితం కోసం చివరి రౌండ్ వరకు వేచిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా 70 వరకు బీజేపీకి వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనావేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి 30కి పైగా సీట్లలో అధిక్యాన్ని కనబరుస్తోంది.