Fire Incident: పార్కింగ్ స్థలంలో షార్ట్ సర్క్యూట్.. 200 వాహనాలు దగ్ధం
ABN , Publish Date - Nov 30 , 2024 | 11:16 AM
వాహనాల పార్కింగ్ స్థలంలో ఆకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో లోపల పార్క్ చేసిన వందలాది కార్మికుల బైక్‌లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదం వారణాసిలోని కాంట్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.
వారణాసి (Varanasi) కాంట్ రైల్వేస్టేషన్‌లోని (Cantt Railway Station) పార్కింగ్ స్థలంలో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో దాదాపు 200 వాహనాలు దగ్ధమయ్యాయి. రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం (Fire Incident) గురించి అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. అయితే అగ్నిమాపక దళం సమయానికి చేరుకోలేకపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు.
మోటార్‌సైకిళ్లకు మంటలు
కాంట్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్‌పై ఉన్న GRP పోలీస్ స్టేషన్ వెనుక రైల్వే మోటార్‌సైకిల్ స్టాండ్ ఉంది. అందులో ఎక్కువ మంది రైల్వే ఉద్యోగుల ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు పార్క్ చేయబడుతున్నాయి. ఆ క్రమంలోనే శుక్రవారం అర్థరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా షార్ట్‌సర్క్యూట్ సంభవించి సమీపంలో పార్క్ చేసిన మోటార్‌సైకిళ్లకు మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు ఇతర వాహనాలపైకి కూడా వేగంగా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే ఉద్యోగులు, సమీపంలో ఉన్న ప్రజలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికి మంటల కారణంగా అనేక వాహనాలు దగ్ధమయ్యాయి.
ఆలస్యం కావడంతో
మంటలు వ్యాపించిన కొద్దిసేపటికే పార్కింగ్ స్థలం మొత్తం పొగలు కమ్ముకోవడంతో పార్కింగ్‌లో పెట్టిన వాహనాలన్నీ దగ్ధమయ్యాయి. దీంతో స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. అక్కడి నుంచి జనం పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ అగ్నిమాపక శాఖ బృందం కొంత ఆలస్యంగా రావడంతో నష్టం మరింత పెరిగింది. ఈ అగ్నిప్రమాదంలో పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన 200కి పైగా వాహనాలు కాలి బూడిదయ్యాయి.
చెలరేగిన వాహనాల్లో
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే CO GRP కాంట్, కాంట్ GRP ఇన్‌స్పెక్టర్ హేమంత్ సింగ్, పోలీస్ స్టేషన్ GRP వారణాసి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. చివరకు అగ్నిమాపక సిబ్బంది తెల్లవారుజామున 4 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
వాహనాల్లో ఎక్కువ భాగం
మోటార్ సైకిల్ స్టాండ్ కేర్ టేకర్లు, క్యాంటీన్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం విద్యుత్ వైరులో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పురవ్వలు వచ్చి మోటారుసైకిల్ కేంద్రంపై పడ్డాయని చెబుతున్నారు. ఆ విధంగా మంటలు చెలరేగాయని వెల్లడించారు. మంటలు చెలరేగిన వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే కార్మికులకు చెందినవే కాగా, ఇతర కారణాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కావాలనే ప్రమాదం సంభవించే విధంగా ప్రయత్నం చేశారా లేదా అనుకోకుండా ప్రమాదం జరిగిందా అనే వివరాలను కూడా ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Fengal Cyclone: ఫెంగల్ తుపాను బీభత్సం.. 7 రాష్ట్రాలకు హెచ్చరిక, స్కూళ్లు, కాలేజీలు బంద్
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Read More National News and Latest Telugu News