Home » Vijaywada West
విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామంలో వైసీపీ ( YCP ) , టీడీపీ ( TDP ) పార్టీల మధ్య ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల్లోని నేతలు దాడి చేసుకున్నారు. దీంతో గొడవకు దిగిన వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. నిడమానూరులో తెలుగుదేశం, వైసీపీ పార్టీలు నూతన సంవత్సరం సందర్భంగా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.
నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో ( Siddhartha College ) వైద్య విద్యను అభ్యసించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1998 బ్యాచ్‌కు చెందిన వైద్యులు సమావేశమై రజతోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు అప్యాయతగా పలకరించుకున్నారు.
విజయవాడ వైసీపీ ( YCP ) లో టికెట్ల లొల్లి ముదిరింది. విజయవాడ వెస్ట్‌లో వెలంపల్లి శ్రీనివాసరావుకి వైసీపీ హై కమాండ్ ఈ సారి ఎన్నికల్లో మొండి చెయి చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై వెలంపల్లిని సీఎం జగన్ పిలిపించి మాట్లాడారు. కాగా విజయవాడ సెంట్రల్ నుంచి వెలంపల్లి పేరుని పరిశీలిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం.
2014 నుంచి నేటి వరకు అన్ని సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ (PM Modi) పాలన చేస్తున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ( CM Jagan ) గురువారం (రేపు) విజయవాడలో పర్యటించనున్నారు. ఇంద్రకీలాద్రిలో కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమిపూజ కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.
కంచికచర్ల దళిత యువకుడు శ్యామ్ కుమార్‌పై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ( Kanti Rana Tata ) తెలిపారు.
భవానీపురంలో 42వ డివిజన్ వైసీపీ కార్యాలయం ఎదుట సాముల వెంకటేశ్వరరెడ్డి భార్యతో కలిసి ధర్నా చేశారు.