Home » Vikarabad
రాష్ట్రంలో సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారానికి సంబంధించి ఎటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. ఈనెల 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారంతో పోలిస్తే ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు కొన్ని జిల్లాల్లో 2 డిగ్రీల మేరకు పెరిగాయి.
అభం శుభం తెలియని ఓ ఐదు శిశువు వీధి కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో జరిగింది.
‘‘మోదీకి 75 ఏళ్ల వయసు దాటాక ప్రధాని ఎవరని ప్రశ్నిస్తున్నారు. 75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధానిగా ఉంటారు. 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ రిటైర్ అవుతారా? అంటూ చేసిన వ్యాఖ్యలపై అమిత్‌షా ఈ మేరకు స్పందించారు.
ప్రధాని మోదీ(PM Modi) అధికారం చేపట్టిన పదేళ్లలో ఆయనపై ఒక్క అవినీతి మరక, ఆరోపణలు లేవని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో గల రాజీవ్ కాలనీకి చెందిన బాలయ్య తన అవసరాల కోసం మేతరి రవి వద్ద అప్పు తీసుకున్నాడు. మూడు నెలల క్రితం రూ.5 వేల అప్పు తీసుకోగా, వడ్డీ కూడా కట్టడం లేదు. దీంతో వడ్డీ వ్యాపారి రవి యువకుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పు గురించి అడిగాడు. ఫోన్ చేస్తా.. అప్పు కడతానని చెప్పినప్పటికీ వ్యాపారి రవి వినిపించుకోలేదు. దాడి చేశాడు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో అర్థరాత్రి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. శివాజీ విగ్రహం, అంబేడ్కర్ భవనం ఏర్పాటు విషయంలో గ్రామంలోని ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.
వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి(Patnam Sunita Mahender Reddy)పై బీఆర్ఎస్ జడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి(Former minister Mahender Reddy)తోపాటు ఆయన భార్య వికారాబాద్ జడ్పీచైర్‌పర్సన్ సునీతారెడ్డి గురువారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.
వికారాబాద్: రైల్వేస్టేషన్లో ప్రమాదం జరిగింది. రెండు గంటల పాటు ఓ వ్యక్తి నరకయాతన పడ్డాడు. ఓ ప్రయాణికుడు కదులుతున్న రైల్లో ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు. అదుపు తప్పి ట్రైన్... ప్లాట్ ఫారం మధ్యలో పడిపోయాడు.
హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నేతలు, అధికారులు