Home » Warangal News
అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు(KCR) కొత్త కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీని వీడిపోతున్న నేతలను కంట్రోల్ చేయడం గులాబీ దళపతికి ఇబ్బందిగా పరిణమిస్తోంది. పార్టీ మారుతారంటూ వార్త అందడమే ఆలస్యం.. ఆ నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు కేసీఆర్. తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్(Aroori Ramesh) బీఆర్ఎస్(BRS)ను వీడి.. బీజేపీ(BJP)లో చేరుతారంటూ వార్తలు వచ్చాయి.
జిల్లాలోని పర్వతగిరి మండలం మోత్య తండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ ప్రమాదానికి గురై ముగ్గరు వ్యక్తులు మృతిచెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. రేపు(మంగళవారం) దుర్గమ్మ పండుగ నేపథ్యంలో విద్యుత్ తీగలను మండపానికి పెట్టే సమయంలో 33/11 కేవీ హెవీ లైన్ తెగి పడింది. ఈ ఘటనలో నలుగురు విద్యుత్ షాక్కు గురయ్యారు.
వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీకి మరో భారీ షాక్ తలిగింది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
నగరంలోని హరిత హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కిచెన్లో అకస్మాత్తుగా మంటలు గా చెలరేగాయి.ఈ సంఘటనతో హోటల్ సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై మంటలను సిబ్బంది ఆర్పివేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Sammakka Saralamma Jatara 2024 Live Updates: ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతరకు దేశ వ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్నారు.
జిల్లాలోని హసన్ పర్తిలో ఆర్టీసీ బస్సు ఆదివారం నాడు చెట్టును ఢీకొంది. హసన్ పర్తి పెద్దచెరువు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తుంది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.
జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రి ( MGM Hospital ) ప్రక్షాళనపై దృష్టి సారించామని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఎంజీఎంలో మంత్రి సురేఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంజీఎంలో వసతులు, రోగులకు అందుతున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... కోతుల బెడద వల్ల వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగి ఎంజీఎంలో మొన్న రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ ను పునరుద్దరించారని మంత్రి కొండా సురేఖ చెప్పారు.
ఐనవోలు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ( Konda surekha ) తెలిపారు. ఐనవోలు జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాట్లపై మంత్రి సురేఖ ఆదివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు హాజరయ్యారు.
బీఆర్ఎస్ ( BRS ) పార్టీది విడుదల చేసింది స్వేదపత్రం కాదని స్వాహా పత్రమని మంత్రి సీతక్క ( Minister Seethakka ) ఎధ్దేవా చేసింది. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ...బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఎక్కడ చెమట చిందించారో చెప్పాలని ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని మంత్రి సీతక్క మండిపడ్డారు.
మీడియా స్వేచ్ఛగా పనిచేయొచ్చని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ... వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి కొండా సురేఖ చెప్పారు.