Minister Seethakka: బీఆర్ఎస్‌ది స్వేదపత్రం కాదు స్వాహా పత్రం
ABN , Publish Date - Dec 26 , 2023 | 08:37 PM
బీఆర్ఎస్ ( BRS ) పార్టీది విడుదల చేసింది స్వేదపత్రం కాదని స్వాహా పత్రమని మంత్రి సీతక్క ( Minister Seethakka ) ఎధ్దేవా చేసింది. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ...బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఎక్కడ చెమట చిందించారో చెప్పాలని ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని మంత్రి సీతక్క మండిపడ్డారు.
హనుమకొండ: బీఆర్ఎస్ ( BRS ) పార్టీది విడుదల చేసింది స్వేదపత్రం కాదని స్వాహా పత్రమని మంత్రి సీతక్క ( Minister Seethakka ) ఎధ్దేవా చేసింది. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ...బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఎక్కడ చెమట చిందించారో చెప్పాలని ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే ప్రజాపాలన సాగిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 28వ తేదీ చారిత్రత్మకమైన రోజుని.. అందుకే కాంగ్రెస్ ఆవిర్భవించిన ఆరోజు నుంచి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే హామీలు ఏమయ్యాయ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారని.. పద్దేళ్లలో వారు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని మంత్రి సీతక్క ప్రశ్నించారు.