Home » Water Polo
జిల్లాలోని మధ్యతరహా ప్రాజక్ట్‌లో ఒక్కటైన బీటీపీ(భైరవానితిప్ప ప్రాజెక్ట్)కి జలకళ సంతరించుకుంది. ఈ ఏడాది తొలకరిలో కర్ణాటకలో వర్షాలు కురుస్తుండ టంతో నాలుగైదు రోజులుగా రిజర్వాయర్‌కు వరదనీరు చేరుతోంది. దీంతో ఈ ఏడాదైనా పంటలు చక్కగా పండించుకోవచ్చన్న ఆశ అన్నదాతల్లో కలుగుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటిమట్టం 1641.8 అడుగులకు చేరుకుంది. హగరిలో వరదనీటి ఇనఫ్లో కొనసాగుతుండటంతో మరో రెండునెలల్లో పూర్తిస్థాయిలో(రెండు టీఎంసీలు)...
జిల్లాలో సోమవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించాయి. నగరంలో భారీ ఎత్తున చెట్లు, విద్యుత స్తంభాలు నేలకొరిగాయి. సమీపంలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. నగరంలో అర్ధరాత్రి ఒంటి గంట వరకూ అంధకారం అలుముకుంది. కొన్ని కాలనీల్లో ఉదయం వరకూ విద్యుత సరఫరా సాధ్యం కాలేదు. శివారు కాలనీలలో మంగళవారం రాత్రి వరకూ విద్యుత సరఫరాను పునరుద్ధరించలేదు. ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లడంతో నగరంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.
వేసవి ముగుస్తోంది. హిందూపురంలో మాత్ర నీటి సమస్య తీరలేదు. పట్టణ వ్యాప్తంగా మునిసిపాలిటీ సరఫరా చేసే నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లతో నీటిని కొనుక్కొని వాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే అకాశాన్నంటే నిత్యవసరాల ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు. దీనికి తోడు తాగునీటి కోసం నెలకు రూ.1500 అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. దీంతో కుటుంబం ఖర్చు మరింత పెరిగి తీవ్ర ఇబ్బందు లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలకేంద్రంలోని వైఎస్‌ఆర్ సర్కిల్‌లో రోడ్డుపై మురుగునీరు యథేచ్ఛగా ప్రవహిస్తోంది. అయినా ప్రజాప్రతినిధులుకానీ, అధికారులుకానీ పట్టించు కున్న పాపానపోలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రొద్దం ప్రధాన వీధుల్లో సరైన డ్రైనేజీ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో రోడ్డుపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామ స్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధిలేక ఆ మురుగునీటిలోనే నడుస్తూ అసహ నం వ్యక్తం చేస్తున్నారు.
గుంతకల్లు నియోజకవర్గంలో తన విజయం తథ్యమని, ఆలూరుకు మించిన భారీ విజయాన్ని అందుకుంటానని టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ వివరాలు. - నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందా? ఎలా పరిష్కరిస్తారు..? జయరాం: ఎక్కడి సమస్యలను పరిష్కరించాలన్నా ...
సీఐ రాజశేఖర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ తంబళ్లపల్లి ఎస్సీ కాలనీ మహిళలు పామిడి పోలీస్ స్టేషన ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సీ కాలనీలో ఆరు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, పంచాయతీ సర్పంచు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక తాము స్వయంగా పైపులైను ఏర్పాటు చేసుకునేందుకు చందాలు వేసుకుని పనులు ప్రారంభించామని, ఆ క్రమంలో సత్యసాయిబాబా ..
అసలే ఎండలు మండిపోతున్నాయి. పెనుకొండ నగర పంచాయతీలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పైప్‌లైన పగిలి రెండు నెలలు కావస్తున్నా 17వ వార్డు వైసీపీ కౌన్సిలర్ రామాంజి అటువైపు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. తాగునీటి పైప్‌లైన అరికట్టాల్సిన మునిసిపల్ అధికారులు మౌనంగా ఉండటంతో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది.
తనకల్లు, ఏప్రిల్ 29: మండలంలోని కొట్టువారి పల్లిలో తాగునీటి సమస్య తీర్చాలంటూ ఆ గ్రామానికి చెందిన మహిళలు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సోమవారం ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ గ్రామంలో గత మూడునెలలుగా తాగునీటి సమస్య నెలకొందన్నారు.
మాటలు చెప్పడమేగాని.. చేతల్లో చూపించలేదు. ఇందుకు ఉదాహరణ.. రాప్తాడు నియోజకవర్గంలో ప్రాజెక్టుల శంకుస్థాపలు. శిలా ఫలకాలను ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టారు. రాప్తాడు నియోజకవర్గంలో రిజర్వాయర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి ఎకరాకూ సాగునీరు ఇస్తామని ఊదరగొట్టారు. పొలాలను సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన గొప్పలు చెప్పారు. కానీ చేతల్లో చూపలేదు. శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నా...
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 25: మండలంలోని కొట్లపల్లి బీసీ కాలనీలో నీటి సమస్యను పరిస్కరించాలంటూ స్థానిక మహిళలు గురువారం గ్రామసచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కాలనీకి చెందిన రాములమ్మ, లక్ష్మమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నాగిరెడ్డి, రామయ్య, బేల్దారి రామాంజి తదితరులు ఖాళీ బిందెలతో గ్రామసచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కొట్లపల్లి, సురగానిపల్లి గ్రామాలకు సంబంధించి మూడుబోర్లు ఉండగా అందులో ఒకటి మరమ్మతుకు గురైందన్నారు.