WATER : తాగునీటి పైప్‌లైన పగిలి నీరు వృథా
ABN , Publish Date - May 01 , 2024 | 12:10 AM
అసలే ఎండలు మండిపోతున్నాయి. పెనుకొండ నగర పంచాయతీలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పైప్‌లైన పగిలి రెండు నెలలు కావస్తున్నా 17వ వార్డు వైసీపీ కౌన్సిలర్ రామాంజి అటువైపు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. తాగునీటి పైప్‌లైన అరికట్టాల్సిన మునిసిపల్ అధికారులు మౌనంగా ఉండటంతో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది.
పట్టించుకోని అధికారులు, నాయకులు
ఇబ్బందులు పడుతున్న మిట్ట ప్రాంతం వాసులు
పెనుకొండ రూరల్, ఏప్రిల్ 30: అసలే ఎండలు మండిపోతున్నాయి. పెనుకొండ నగర పంచాయతీలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పైప్‌లైన పగిలి రెండు నెలలు కావస్తున్నా 17వ వార్డు వైసీపీ కౌన్సిలర్ రామాంజి అటువైపు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. తాగునీటి పైప్‌లైన అరికట్టాల్సిన మునిసిపల్ అధికారులు మౌనంగా ఉండటంతో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. పెనుకొండ నగర పంచాయతీ 17వ వార్డు మహదేవ్‌పల్లిలో తాగునీటి పైప్‌లైన పగిలి నీరంతా వృఽథా అవుతోంది.
నగర పంచాయతీ పరిధిలోని షీప్‌ఫారం వద్ద బోర్లువేసి సంపులు ఏర్పాటుచేసి అక్కడి నుంచి పట్టణానికి పైప్‌లైన ద్వారా నీటిని అందిస్తున్నారు. షీప్‌ఫారం నుంచి మహదేవపల్లి, రాజేశ్వర కాలనీకి పైప్‌లైన ద్వారా నీటిని అందిస్తున్నారు. ఈ క్రమంలో నగర పంచాయతీలోని మహదేవపల్లిలో రెండు నెలల కిందట ప్రధాన పైప్‌లైన పగిలి నీరంతా వృథా అవుతోంది. పైప్‌లైన మరమ్మతులు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కౌన్సిలర్ రామాంజిని వేడుకున్నా ఆయన పట్టించుకున్న పాపానపోలేదని కాలనీ వాసులు అంటున్నారు. తాగునీటి పైప్‌లైన పగలిపోవడంతో ఎత్తు ప్రాంతంలో ఉన్న నివాసాలకు తాగునీరు అందక నానా అవస్థలు పడుతున్నామన్నారు.
ఒక్కోసారి పగిలిన పైప్‌లైన వద్ద కొళాయి పైప్ ఏర్పాటు చేసి, దానిద్వారా బిందెలో పట్టుకుని నీటిని తెచ్చుకునే పరిస్థితి నెలకొందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగిలిన పైప్‌లైన పక్కనే పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటితొట్టె ఉందన్నారు. తొట్టె కాస్త ఛద్రమైందన్నారు. నీటి తొట్టెకు మరమ్మతులు చేస్తే ఎండాకాలంలో పశువులు నీరుతాగేందుకు అనువుగా ఉంటుందని కౌన్సిలర్‌ను వేడుకున్నా ఆయన పట్టించుకోవడం లేదన్నారు. కౌన్సి లర్‌గా రామాంజి ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అభి వృద్ధి పని కూడా చేపట్టలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా మునిసి పల్ అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....