Home » West Godavari
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. గెలుపుకోసం రాజకీయ పార్టీలు వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ఏ నియోజకవర్గంలో పక్కాగా గెలవచ్చు.. ఏ నియోజకవర్గంలో తమకు కష్టంగా ఉందనే అంచనాలను అన్ని పార్టీలు వేస్తున్నాయి. దానికి అనుగుణంగా తమ వ్యూహాలను రచిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు కూటమితో పాటు వైసీపీ తమ ప్రణాళికలను రెడీ చేశాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వగా.. క్షేత్రస్థాయిలో నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈక్రమంలో చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఉంగుటూరు నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ప.గో.జిల్లా: రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిడదవోలులో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం మతపెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఎన్డీయే కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు తణుకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప.గో. జిల్లా: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడిగా తణుకు, నిడదవోలులలో జరిగే బహిరంగ సభలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఇద్ధరు నేతలు సంయుక్తంగా హాజరవుతున్న సభలు..
Andhrapradesh: కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా మందును పంపిణీ చేసి లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ ఆనందయ్య రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఆయన టీడీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా కాసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు డాక్టర్ ఆనందయ్య జిల్లాకు వచ్చారు.
నరసాపురం సిటింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం జరిగినట్లు సమాచారం..
వైసీపీ(YCP)లో వర్గ విబేధాలు బయటపడుతున్నాయి. సొంత పార్టీలో నాయకులే కొట్టు కుంటున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో అసంతృప్త నేతలు తమ గళం విప్పుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి.
తాజాగా తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో కరెంట్ బిల్లుకు సంబంధించిన స్కామ్ లో చిక్కుకుని ఏకంగా రూ. 1.85 లక్షలు మోసపోయాడు.
పశ్చిమ గోదావరి జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకొల్లు నియోజవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి నిమ్మల రామానాయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న రామానాయుడుకు ప్రజలు అడుగడుగున నీరాజనం పలుకుతున్నారు.
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది.