Nara Lokesh: ప.గో. జిల్లా: పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్
ABN , Publish Date - Jan 06 , 2025 | 08:58 AM
ప.గో. జిల్లా: రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్య టిస్తారు. ఉండి, కాళ్ళ, భీమవరం తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభిస్తారు. మంత్రి నారా లోకేశ్ పర్యటనలో ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.
ప.గో. జిల్లా: రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) సోమవారం పశ్చిమగోదావరి జిల్లా (West Godavari Dist.)లో పర్య టిస్తారు. ఉండి, కాళ్ళ, భీమవరం తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభిస్తారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఉండి ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులను మంత్రి లోకేష్ ప్రారంభిస్తారు. అనంతరం కాళ్ల మండలం పెద ఆమిరం జువ్వలపాలెం రోడ్ లో శ్రీ రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పెద ఆమిరం.. ఉండి లింక్ రోడ్డు వైన్డింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల సంక్రాంతి సంబరాల్లో మంత్రి లోకేష్ పాల్గొంటారు.
కాగా మంత్రి నారా లోకేశ్ పర్యటనలో ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఉండిలో మంత్రి లోకేశ్ పర్య టించే ప్రాంతాలను జేసీ ఆదివారం పరిశీలించారు. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభించనున్న సీసీ రహదారి, పూర్వపు పాఠశాల భవనం, క్రీడాసౌకర్యాలు నిమిత్తం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. గ్రామంలో రహదారుల పక్కన చెత్తచెదారం లేకుండా శానిటేషన్ చేసి బ్లీచింగ్ చల్లే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఎస్పీ నయీం ఆద్నాన్ అస్మి తెలిపారు. ప్రారంభోత్సవ శిలాఫలకాలను సుందరంగా తీర్చిదిద్దారు.
మంత్రి లోకేశ్ పర్యటన ఇలా...
సోమవారం ఉదయం 7.30 గంటలకు: ఉండవల్లిలోని తమ నివాసం నుంచి రోడ్డు మార్గంలో మంత్రి లోకేష్ పయనం
10 గంటలకు రోడ్డు మార్గంలో ఉండి జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణానికి చేరిక
ఉదయం 10.00 నుంచి 10.45 గంటల వరకు: పునర్నిర్మించిన 108 ఏళ్ల పాఠశాల భవనం ప్రారంభం
ఉదయం 11–00 గంటలకు రోడ్డు మార్గంలో కాళ్ల మండలం పెద అమిరం చేరిక
ఉదయం 11.00 –11.40 గంటల వరకు దివంగత రతన్‌టాటా విగ్రహం ఆవిష్కరణ
ఉదయం 11.45 చిన అమిరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చేరిక
ఉదయం 11.45–12.30 విద్యార్థులతో సమావేశానికి హాజరు
మధ్యాహ్నం 12.40–2.30 గంటల వరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నివాసంలో కార్యకర్తలతో సమావేశం
మధ్యాహ్నం 2.45–4.00 కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నివాసం సందర్శన, సాయంత్రం 4.00 గంటలకు ఉండవల్లికి రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన
ఇక ప్రతి ఇల్లూ విద్యుత్కేంద్రమే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News