Home » West Godavari
Andhrapradesh: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నేడు స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో స్వామిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా దేవస్థానం టికెట్ల కౌంటర్ల సర్వర్లు పనిచేయలేదు. సాంకేతిక లోపం కారణంగా టికెట్ కౌంటర్ల సర్వర్లు పనిచేయని పరిస్థితి.
Andhrapradesh: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ తరపున టికెట్ ఆశించిన భంగపడ్డ మాజీ మంత్రి పీతల సుజాత పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి శుక్రవారం సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించిందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
Andhrapradesh: జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా రాజ్యం పార్టీ నాటి నుంచి పవన్ భాష ఏ రకంగా ఉందో అందరికీ తెలుసన్నారు.
Andhrapradesh: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ క్యూలైన్లో స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
Andhrapradesh: ఉండి టీడీపీ అసెంబ్లీ టికెట్ వివాదంపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. ఉండి టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి హైకమాండ్ కేటాయించింది. అయితే అధిష్టానం తీరుపై మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ ఆశిస్తున్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండానే రామరాజుకి టికెట్ ఇచ్చారంటూ మండిపడ్డారు.
Andhrapradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారని.. అయోధ్య వెళ్ళొచ్చిన తరువాత కిర్లంపూడి వస్తానని మరోకసారి కబురు పంపించారన్నారు. ఎటువంటి కోరికలు లేకుండా కలుస్తానని ఇప్పటికే చెప్పానని అన్నారు.
Pawan Kalyan to contest from Bhimavaram: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్ది టీడీపీ-జనసేన మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కి వస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ నేతలు పవన్ కల్యాణ్ పోటీపై కీలక సమాచారం అందిస్తున్నారు. పవన్ పోటీ దాదాపు ఖరారైంది.
YSRCP vs TDP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్సీపీ చీఫ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు గుడ్ చెప్పారు. నేరుగా వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అమరావతి: పొత్తుల విషయం తేలపోవడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ జనసేన అభ్యర్థుల ఎంపిక స్పష్టతకు రాలేదు. జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లు 15 ఉండగా కేవలం ఆరు చోట్ల టీడీపీ అభ్యర్థులు, మూడు చోట్ల జనసేన అభ్యర్థులు ఖరారయ్యారు. మిగతా స్థానాలపై టీడీపీ, జనసేన మధ్య చర్చలు కొలిక్కి రాలేదు.
పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, సర్వేలన్నీ తెలుగుదేశం, జనసేన కూటములకే అనుకూలంగా ఉన్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ వ్యాఖ్యానించారు.