Home » Yadagirigutta
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంత్యుత్సవాలు పాంచరాత్రాగమ రీతిలో సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీఘళ్ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో జరిగాయి.
రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా వాటిని సరిగా ప్రచారం చేసుకోలేకనే ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఆదివారం ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. వారాంతపు సెలవు రోజు, వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. చాలా మంది భక్తులు తమ సొంతవాహనాల్లో తరలివచ్చారు. దీంతో యాదగిరిగుట్ట కొండ మీద, కొండ కింద పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో కిటకిటలాడాయి.
ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విద్యుదుత్పత్తికి సిద్ధమవుతోంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న ఈ ప్లాంటులో రెండు యూనిట్లలో బాయిలర్లను మండించే ప్రక్రియ (లైటప్) మంగళవారం విజయవంతంగా పూర్తయింది. దీంతో జెన్కో అధికారులు అక్టోబర్ 10 నాటికి 800 మెగావాట్ల సామర్థ్యం గల ఈ రెండు యూనిట్ల నుంచి విద్యుదుత్పాదన ప్రారంభించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్లాంటు వద్దే సమీక్ష నిర్వహించి అక్టోబర్ నాటికి మొదటి రెండు యూనిట్లను విద్యుదుత్పత్తికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి జెన్కో యంత్రాంగం పనులను వేగంగా కొనసాగిస్తోంది.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టపై ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. దాదాపు 40వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పట్టింది.
యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ ఇన్చార్జ్ ఈఓ రామకృష్ణరావుపై బదిలీ వేటు పడింది. ప్రోటోకాల్ విషయంపై నిర్లక్ష్యం చేశారని ఆలయ ఈవోని దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది. యాదగిరిగుట్ట కొత్త ఆలయ ఈవోగా భాస్కర్ రావు నియమించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగట్టన్ని సందర్శించారు.
యాదగిరి గుట్ట (Yadagirigutta) లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న(సోమవారం) పర్యటించారు. ఆలయంలో ప్రత్యేక పూజల నిమిత్తం సీఎం రేవంత్ దంపతులు, నల్లొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ బల్లాపై కూర్చున్నారు. అయితే బల్లాపై ప్లేస్ లేకపోవడంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఓ చిన్న స్టూల్ మీద కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
యాదాద్రి: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో భక్తులరద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.
యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానా కు 28రోజుల్లో రూ.2.38కోట్ల హుండీ ఆదాయం లభించింది. గత నెల 9నుంచి ఈ నెల
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలు తయారు చేసేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సర్క్యూలర్‌ను జారీ చేసింది.