Home » Yashasvi Jaiswal
టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో చెలరేగుతున్నాడు. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ ఈ సిరీస్లో అత్యధికంగా 600కుపైగా పరుగులు సాధించాడు.
ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. క్రీజులో ధృవ్ జురేల్(30), కుల్దీప్ యాదవ్(17) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉంది.
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న జైస్వాల్ ఈ సిరీస్లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. దీంతో ఈ సిరీస్లో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు.
ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా తడబడుతోంది. 130 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోర్ 131/4గా ఉంది. ప్రస్తుతం భారత జట్టు ఇంకా 222 పరుగులు వెనుకబడి ఉంది.
యశస్వి జైస్వాల్ తాజాగా ఓ గొప్ప గౌరవాన్ని అందుకున్నాడు. బ్రిటన్కు చెందిన ప్రముఖ పత్రిక ``ది టెలిగ్రాఫ్`` ప్రకటించిన భారత అత్యుత్తమ టాప్-10 బెస్ట్ బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు.
ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ మాత్రం జైస్వాల్ ఆటతీరుపై విచిత్రమైన కామెంట్లు చేశాడు. యశస్వి సూపర్ బ్యాటింగ్ వెనుక తమ క్రెడిట్ కూడా ఉందని వ్యాఖ్యానించి చాలా మందిని ఆశ్చర్యపరిచాడు.
ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా.. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత జట్టు నిర్దేశించిన 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. టీమిండియా స్పిన్నర్ల ధాటికి 122 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన జైస్వాల్ డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు.
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపిస్తున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ డబుల్ సెంచరీలతో దుమ్ములేపుతున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో డబుల్ సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. తాజాగా రాజ్కోట్ వేదికగ జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లోనూ డబుల్ సెంచరీ కొట్టాడు.
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత ఆటగాళ్లందరూ తమ చేతులకు నల్లటి బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. ఇలా ఎందుకు ధరించారో చాలా మందికి అర్థం కాలేదు.