Share News

Yashasvi Jaiswal: జైస్వాల్ కొంపముంచిన నోటిదూల.. తగ్గకపోతే కెరీర్ ఫినిష్

ABN , Publish Date - Dec 16 , 2024 | 10:58 AM

నోటిదూలతో తంటాలు తెచ్చుకుంటున్నాడు టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. అనవసరంగా గెలికి భారత జట్టు కొంపముంచుతున్నాడు. ఈ విషయంలో అతడు తగ్గకపోతే మాత్రం కెరీర్ ఫినిష్ అవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Yashasvi Jaiswal: జైస్వాల్ కొంపముంచిన నోటిదూల.. తగ్గకపోతే కెరీర్ ఫినిష్
Yashasvi Jaiswal

IND vs AUS: క్రికెట్‌లో స్లెడ్జింగ్ కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఎక్కువగా స్లెడ్జ్ చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని టీమ్స్‌లో ఇది సాధారణంగా కనిపిస్తోంది. అందుకు టీమిండియా అతీతం కాదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి భారత జట్టులో దూకుడు పెరిగిపోయింది. అతడు సారథ్యం నుంచి తప్పుకున్నా.. ఇంకా అగ్రెసివ్ అప్రోచ్ పోవడం లేదు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్ లాంటి వాళ్లు దూకుడుకు పర్యాయ పదంగా మారారు. అయితే ఇదే వాళ్ల కొంపముంచుతోంది. వీళ్లు అనవసర అగ్రెషన్‌తో టీమ్‌ను ఇబ్బందుల్లోకి నెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


రెచ్చగొట్టి మరీ..

నోటిదూలతో తంటాలు తెచ్చుకుంటున్నాడు టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. అనవసరంగా గెలికి భారత జట్టు కొంపముంచుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా సీనియర్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్‌ను గేలి చేశాడు జైస్వాల్. పెర్త్ ఆతిథ్యం ఇచ్చిన తొలి టెస్టులో అతడ్ని రెచ్చగొట్టాడు. నీ బౌలింగ్ అప్పటిలా లేదు.. బంతులు చాలా స్లోగా వస్తున్నాయి, పస లేదంటూ స్టార్క్‌ అహం మీద దెబ్బకొట్టాడు. దీంతో నెక్స్ట్ మ్యాచ్ నుంచి జైస్వాల్‌ను టార్గెట్ చేసుకొని నిప్పులు చెరిగే బంతులతో రెచ్చిపోతున్నాడు కంగారూ పేసర్.


అనవసరంగా పెట్టుకున్నాడు!

అడిలైడ్ టెస్ట్‌తో పాటు గబ్బా టెస్ట్‌లోనూ జైస్వాల్‌ను ఔట్ చేశాడు స్టార్క్. అతడితో పాటు ఇతర బ్యాటర్లకు కూడా స్టన్నింగ్ డెలివరీస్ వేస్తూ వణికిస్తున్నాడు ఆసీస్ పేసర్. తొలి టెస్ట్‌లో జైస్వాల్ నోటిదూల వల్ల స్టార్క్‌లో రాణించాలనే తపన, కోపం పెరగడంతో అతడు చెలరేగిపోతున్నాడు. దీంతో అతడు తప్పు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జైస్వాల్ తన బ్యాటింగ్ మీద ఫోకస్ చేయాలని.. మూడు ఫార్మాట్లలోనూ తోపు ప్లేయర్‌గా పేరు తెచ్చుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. సీనియారిటీ వచ్చాక స్లెడ్జింగ్ బాగుంటుందని.. కెరీర్ మొదట్లోనే ఇలా చేస్తే స్టార్క్ లాంటి తోపులు వీళ్ల కెరీర్‌ను ఖతం చేస్తారని హెచ్చరిస్తున్నారు. వరుసగా ఫ్లాప్ అయితే టీమ్‌లో చోటు దక్కదని.. కాబట్టి సీనియర్లతో పెట్టుకోవద్దని హితబోధ చేస్తున్నారు.


Also Read:

పదే పదే అదే తప్పు.. కోహ్లీ.. ఇక మారవా..

పాక్‌పై భారత్‌ గెలుపు

‘ముస్తాక్‌ అలీ’ విజేత ముంబై

భారత్‌దే జూనియర్‌ హాకీ ఆసియా కప్‌

For More Sports And Telugu News

Updated Date - Dec 16 , 2024 | 11:01 AM