Home » YS Jagan Mohan Reddy
పార్టీ ఎంపీలు, నేతలు గుడ్‌బై చెబుతున్న తరుణంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ వచ్చే నెల 3న సతీసమేతంగా లండన్ బయల్దేరుతున్నారు..
వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్న మోపిదేవి వెంకటరమణ.. ఆ పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీలో విసిగివేసారిపోయిన ఆయన గుడ్ బై చెప్పేశారు.. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్, వైఎస్ జగన్ పేర్లు ప్రస్తావించి మరీ.. ఇద్దరి మధ్య ఉన్న తేడాలను కూడా చెప్పుకొచ్చారు..
వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుడి భుజంగా మోపిదేవి వెంకటరమణ ఉన్నా రు. ఆ పార్టీకి గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం బాపట్ల జిల్లాలో పెద్ద దిక్కు గా వ్యవహరించారు. అయితే జగన్ తీరుతో పార్టీలో ఇమడలేకపోతున్న రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవటం ఆ పార్టీకి పెద్ద షాక్‌గా చెప్పవచ్చు..
వైసీపీ నేతల అరాచకాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. రాష్ట్ర సరిహద్దులు దాటిపోయాయి. పైకి ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగిన అధికారులుగా కనిపించే కొందరు ఐపీఎస్‌లు వైసీపీ నేతల అరాచకాలకు వంతపాడినట్లు తెలుస్తోంది.
వైసీపీ (YSR Congress) అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ నేతలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా రెచ్చిపోయారు..! మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ అడ్డు అదుపూ లేకుండా ప్రవర్తించారు. వైసీపీ నేతల అరాచకాలతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇబ్బంది పడినన వారే అన్నది జగమెరగిగిన సత్యేమనని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమైంది...
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు తన వికృత చేష్టలతో అప్రదిష్ట పాలయ్యారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపణలు చేశారు. ఆ ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేసి రాజకీయాల నుంచి తొలగించాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అచ్యుతాపురం ప్రమాద ఘటనకు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జగన్‌పై కార్మిక శాఖ మంత్రి సుభాష్ మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా ప్రమాదం ఘటనను మాజీ సీఎం జగన్ రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
అచ్యుతాపురం(Achyutapuram) ఘటనను ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లి రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. బాధితులను ఓదార్చాల్సింది పోయి రాజకీయ విమర్శలకు జగన్ దిగటం సిగ్గుచేటని మంత్రి రవీంద్ర ఆగ్రహించారు.
ఏపీలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లని మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
వైసీపీ నేత జోగి రమేష్ బుధవారం మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన పోలీస్ విచారణ అనంతరం సర్కిల్ కార్యాలయం నుంచి జోగి రమేశ్ సైలెంట్‌గా బయటకు వెళ్లిపోయారు. మీడియాతో సైతం ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ రోజు జరిగిన పోలీస్ విచారణకు తన తరఫు న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, విజయవాడ నగరానికి చెందిన వైసీీపీ నేత పి. గౌతంరెడ్డితో కలిసి జోగి రమేశ్ మంగళగిరి సర్కిల్ కార్యాలయానికి వచ్చారు.