Share News

YSRCP: జగన్ సర్కార్‌లో అంతులేని అరాచకాలు.. హీరోయిన్‌కు వైసీపీ టార్చర్!

ABN , Publish Date - Aug 26 , 2024 | 01:51 PM

వైసీపీ (YSR Congress) అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ నేతలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా రెచ్చిపోయారు..! మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ అడ్డు అదుపూ లేకుండా ప్రవర్తించారు. వైసీపీ నేతల అరాచకాలతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇబ్బంది పడినన వారే అన్నది జగమెరగిగిన సత్యేమనని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమైంది...

YSRCP: జగన్ సర్కార్‌లో అంతులేని అరాచకాలు.. హీరోయిన్‌కు వైసీపీ టార్చర్!
YSR Congress

వైసీపీ (YSR Congress) అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ నేతలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా రెచ్చిపోయారు..! మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ అడ్డు అదుపూ లేకుండా ప్రవర్తించారు. వైసీపీ నేతల అరాచకాలతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇబ్బంది పడినన వారే అన్నది జగమెరగిగిన సత్యేమనని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమైంది. ఇక జగన్ ప్రభుత్వంలో (YS Jagan Govt) అరచకాలు, దారుణాలకు అంతేలేదు..! అలా అధికారం పోయిందే లేదో.. ఇలా తవ్వే కొద్దీ వైసీపీ నేతల ఆగడాలు వెలుగు చూస్తున్నాయ్.. అందులోనూ అన్నీ విస్తుగొలిపే విషయాలే కావడం గమనార్హం. ముంబైకు చెందిన బాలీవుడ్ నటిని (Bollywood Actress) విజయవాడలో శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశాడు ఓ వైసీపీ నేత. ఆ నటి బాలీవుడ్‌లో పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్. ఉత్తరాదికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ నేత కుమారుడితో హీరోయిన్ లవ్‌లో పడింది. అయితే.. పెళ్లికి ఆ పారిశ్రామికవేత్త కుటుంబం అంగీకరించలేదు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

YSRCP-Bollywopod-Actress.jpg

వదిలిపెట్టు.. లేకుంటే..!

నాడు వైఎస్ జగన్ ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తి సాయం కోరాడు వైసీపీ నేత. తన కుమారుడి జోలికి రావొద్దని.. వదిలి వెళ్లిపోవాలని, ఇందుకు గాను హీరోయిన్‌కు డబ్బులు కూడా ఆ కీలక వ్యక్తి ఆఫర్ చేసినట్లుగా సమాచారం. కోటి రూపాయలతో మొదలుపెట్టి 5 కోట్ల వరకూ ఆ కుటుంబం.. హీరోయిన్‌కు ఆఫర్ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అయినా ఆ హీరోయిన్ వెనక్కి తగ్గకపోవడంతో.. నటి, ఆమె ఫ్యామిలీని విజయవాడకు తీసుకొచ్చారు ఐఏఎస్ ఆఫీసర్. ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ గెస్ట్ హౌస్‌లో హీరోయిన్ కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేసిందని సమాచారం. అయితే.. ఈ మొత్తం వ్యవహారంపై విజయవాడలో ఓ స్థానిక వ్యక్తి ఇచ్చిన కల్పిత ఫిర్యాదుతో చీటింగ్ కేసును బనాయించడం జరిగింది. దీంతో.. సినీ నటి, కుటుంబ సభ్యులను ఆ నటి, ఆ ఫ్యామిలీని సబ్ జైలుకు తరలించారు. దీంతో భయపడిపోయిన హీరోయిన్, ఆమె కుటుంబం పెళ్లి ప్రపోజల్‌ను విరమించుకొని విజయవాడ నుంచి ముంబైకి వెళ్లిపోయిందట. అయితే.. ఎఫ్ఐఆర్ కాపీ తప్ప ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో బాధిత కుటుంబం నోరు విప్పలేదు.


Actress-Bollywood.jpg

ఇంకెన్ని ఉన్నాయో..!

ఇప్పుడీ నటి వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూడటంతో అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైందని ఎప్పుడైతే బాధితులు తెలుసుకున్నారో ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తున్నారు. అయితే.. ఆ హీరోయిన్ ఎవరు..? వైసీపీ నేత, పారిశ్రామికవేత్త ఎవరు..? అనేది బయటికి వచ్చింది కానీ.. చాలా గోప్యంగానే వ్యవహారం లోలోపల నడిపించేసినట్లుగా అర్థమవుతోంది. అయితే.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లేదు గనుక ఒకవేళ ముంబై నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటిది ఏమైనా జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది..? అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇంత రచ్చ జరిగిన తర్వాత మళ్లీ ఎందుకీ గొడవలు అనుకుని ఆ హీరోయిన్, ఆమె ఫ్యామిలీ మిన్నకుండిపోతుందో..? లేకుంటే మళ్లీ పోలీసులను ఆశ్రయించడం ఏమైనా ఉంటుందా..? అన్నది తెలియాల్సి ఉంది.

Updated Date - Aug 26 , 2024 | 02:55 PM