Manikya Varaprasad: వైసీపీ నేతలు అహంకారం వీడాలి
ABN , Publish Date - Aug 25 , 2024 | 01:39 PM
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు తన వికృత చేష్టలతో అప్రదిష్ట పాలయ్యారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపణలు చేశారు. ఆ ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేసి రాజకీయాల నుంచి తొలగించాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు తన వికృత చేష్టలతో అప్రదిష్ట పాలయ్యారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపణలు చేశారు. ఆ ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేసి రాజకీయాల నుంచి తొలగించాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. జగన్ పార్టీ కార్యకర్తలకు అనంత్ బాబు దళితులను ఎలా చంపాలి, మహిళలను ఎలా వేధించాలనే అంశంపై శిక్షణ ఇప్పిస్తారని మాణిక్యవరప్రసాద్ విమర్శలు చేశారు.
ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. త్వరలోనే వైసీపీ ఎమ్మెల్సీ వైఖరీపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ని కలుస్తామని అన్నారు. ఆ పార్టీ నేతలు అనంత్ బాబు, తోట త్రిమూర్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అహంకారాన్ని వైసీపీ నేతలు వదులుకోవాలని చెప్పారు. నేరాలు ఎలా చేయాలనే అంశంపై వీరంతా శిక్షణ ఇవ్వడమా.. సిగ్గు చేటని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.
జగన్ మానసిక పరిస్థితిపై అనుమానాలు: కనపర్తి శ్రీనివాసరావు
జగన్ మానసిక పరిస్థితిపై ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. అచ్యుతాపురం బాధితుల పరామర్శకు వెళ్లి వెకిలి నవ్వులు నవ్వటం, వినుకొండలో విలేఖరులు ప్రశ్నిస్తే " ఫ్లో పోతుంది ఆగండయ్యా అంటూ.. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను " అంటూ పక్కనున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుని అడగటం చూస్తుంటే 11 సీట్ల ప్రభావంతో మతి భ్రమించినట్లుంది’’ ఉందని కనపర్తి శ్రీనివాసరావు విమర్శలు చేశారు.