Share News

Minister Ravindra: అచ్యుతాపురం ఘటనను మాజీ సీఎం జగన్ రాజకీయం చేస్తున్నారు..

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:09 PM

అచ్యుతాపురం(Achyutapuram) ఘటనను ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లి రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. బాధితులను ఓదార్చాల్సింది పోయి రాజకీయ విమర్శలకు జగన్ దిగటం సిగ్గుచేటని మంత్రి రవీంద్ర ఆగ్రహించారు.

Minister Ravindra: అచ్యుతాపురం ఘటనను మాజీ సీఎం జగన్ రాజకీయం చేస్తున్నారు..

మచిలీపట్నం: అచ్యుతాపురం(Achyutapuram) ఘటనను ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లి రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. బాధితులను ఓదార్చాల్సింది పోయి రాజకీయ విమర్శలకు జగన్ దిగటం సిగ్గుచేటని మంత్రి రవీంద్ర ఆగ్రహించారు.


జగన్ విమర్శలు సరికాదు..

అచ్యుతాపురం ఘటనపై కూటమి ప్రభుత్వం ఘటనపై సరిగా స్పందించలేదంటూ వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలను మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హోంమంత్రి అనిత, సీఎం చంద్రబాబు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారని తెలిపారు. ఘటనా స్థలానికి అధికారులు వెళ్లాల్సిందిగా.. బాధితులకు సరైన వైద్యం అందించి అక్కడి పరిస్థితులపై పర్యవేక్షించాలంటూ అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు. తీవ్ర వేదనలో ఉన్న బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సిన చోట వైఎస్ జగన్ రాజకీయాలు మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి అన్నారు.


ఆ అధికారుల వల్లే ప్రమాదాలు..

గత ప్రభుత్వంలో అర్హత లేని అధికారులను డిప్యుటేషన్‌పై ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్షన్ అధికారులుగా నియమించారని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. ఇలాంటి నియామకాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. డిప్యుటేషన్ల కోసం గత వైసీపీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తిన ప్రతి అధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రమాదంపై చంద్రబాబు సర్కార్ వెంటనే స్పందించిందని, బాధితులకు అండగా నిలిచినట్లు చెప్పారు. కానీ జగన్ మాత్రం బాధితుల పరామర్శకు వెళ్లి విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు అన్నారు. అచ్యుతాపురం ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని, ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఇకనైనా జగన్ శవరాజకీయాలు చేయడం ఆపాలంటూ మంత్రి కొల్లు రవీంద్ర హితవు పలికారు.

Updated Date - Aug 23 , 2024 | 03:13 PM