Home » YuvaGalam
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రతీచోట లోకేశ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యువనేతను చూసేందుకు, కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు పాదయాత్ర ప్రాంతానికి తరలివస్తున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
3 రోజుల క్రితం ఒంగోలులో ‘జయహో బీసీ సభ’ జరిగింది. పెద్ద సంఖ్యలో జనం హాజరైన ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఉదయ భాను అనుసంధానకర్తగా వ్యవహరించారు. లోకేష్ సమక్షంలో జరిగిన ఈ సభలో ఉదయ భాను బాధితులకు మైక్ అందించి వారి బాధలను సభ దృష్టికి తీసుకొచ్చారు. హూందాగా, ఓపిగ్గా వింటూ బాధితులకు ఓదార్పునిచ్చారు. వేర్వేరు ఘటనల్లో బాధితులైన బీసీలకు టీడీపీ కుటుంబం అండగా నిలుస్తుందని లోకేష్ సమక్షంలో ఆమె భరోసా కల్పించారు. ఆమె ఈ విధంగా బాధితులకు గొంతుకనివ్వడం, అందునా టీడీపీ కార్యక్రమంలో పాల్గొనడం పాలక పక్షానికి ఏమాత్రం రుచించలేదు.
టీడీపీ (TDP) జాతీయ ప్రాధాన్య కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) అప్రతిహాసంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒంగోలు జిల్లాలో కొనసాగుతున్న ఈ యాత్ర ఆగస్టు 1న పల్నాడు జిల్లాలోకి అడుగుపెట్టనుంది. జిల్లాలో వినుకొండ నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభమవనుంది.
‘రాష్ట్రంలో చట్టాలను అమలుచేయాల్సిన పాలకులే సీబీఐ కేసుల్లో ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అందుకే బలహీనవర్గాల వారికి న్యాయం జరక్కపోగా వారిపై దాడులు పెరిగాయి. హత్యలు పెరిగాయి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదరి లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో
ప్రకాశం జిల్లాలో ‘యువగళం’లో భాగంగా యువనేత నారా లోకేశ్‌ను స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన కటౌట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోకేశ్‌ను ఒక రాజకీయ వారసుడిగా చూసే రోజులు పోయి మాస్ ఇమేజ్‌తో ముందుకెళుతున్న టీడీపీ యువ రక్తంగా ప్రజలు, కార్యకర్తలు భావిస్తున్నారనడానికి ఈ కటౌట్ ఒక నిదర్శనం. ఈ కటౌట్‌లో నారా లోకేశ్ తప్ప వేరెవరూ లేరు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో యువగళంలో కొత్త ప్రయోగాన్ని టీడీపీ చేపట్టింది. ఏఐ టెక్నాలజీ ద్వారా కృత్రిమ యాంకర్‌తో వార్తలు చదివేలా డిజైన్ చేశారు. టీడీపీ అనుబంధ విభాగం ఐ టీడీపీ ద్వారా కొత్త కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు.
యువగళం పాదయాత్రపై ఐ ప్యాక్ సభ్యులు నిఘా పెట్టారు. కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రలోకి ఐ ప్యాక్ సభ్యుడు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఐ ప్యాక్ సభ్యుడిని టీడీపీ క్యాడర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. యువగళం పాదయాత్రలో జరుగుతున్న లైవ్ అప్డేట్స్‌ను, ఎప్పటికప్పుడు ఐ ప్యాక్ సభ్యులు బయటికి చేరవేస్తున్నారు.
ఏపీ వ్యాప్తంగా నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా బలంగా, ప్రజాగళంగా ఇప్పటివరకు 53 శాసనసభ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. 152 రోజుల పాదయాత్రలో సుమారు 30 లక్షల మంది ప్రజలను లోకేష్ నేరుగా కలుసుకుని వాళ్ల సమస్యలను విన్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
టీడీపీ యువనే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్ల చారిత్రాత్మక మైలురాయికి చేరుకుంది.