Home » Telangana » Hyderabad
మంచు కుటుంబంలో ఊహించని మలుపులు.. నిముషానికొక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసులు వారి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Telangana: కోర్టు ఆదేశాల మేరకు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయితే నరేందర్ రెడ్డి, సురేష్ కస్టడీ విచారణలో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. నరేందర్ రెడ్డి విచారణకు సహకరించలేదని కోర్టుకు పోలీసులు తెలిపారు. లగచర్లలో దాడికి ముందు జోరుగా లిక్కర్ పార్టీలు జరిగాయని ఖాకీలు తెలిపారు. దాడికి ముందు 3 రోజుల పాటు లిక్కర్ పార్టీలు జరిగాయన్నారు.
పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో మరో నీతి ఎలా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిలదీశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేటీఆర్ ప్రశ్నలవర్షం కురిపించారు.
విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు.
హాస్టల్ విద్యార్థుల మధ్య స్వల్ప వివాద నేపథ్యంలో తల్లిదండ్రులను పిలిపించి ఇతర విద్యార్థినులపై దాడి చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక తల్లిదండ్రులతో పలువురు హాస్టల్ విద్యార్థినులను వార్డెన్ చెప్పుతో కొట్టించారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. తోటి విద్యార్థినులను..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 11 నుంచి 13 వరకూ రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. ముందుగా ఈనెల 11న రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు.
హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ఆశావర్కర్లపై పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC)కి ఫిర్యాదు అందింది. సుల్తాన్ బజార్ ఏసీపీ కె.శంకర్, సీఐ శ్రీనివాస్ చారిలపై ఎన్హెచ్ఆర్సీకి ప్రముఖ న్యాయవాది ఇమ్మినేని రామారావు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కార్యక్రమానికి ఆహ్వానించినా..
టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తేల్చి చెప్పారు. తన కొరియోగ్రఫీలో గేమ్ చేంజర్ నుంచి ఓ అద్భుతమైన పాట రాబోతుందని, అది అందరికీ కచ్చితంగా నచ్చుతుందని జానీ మాస్టర్ చెప్పారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. రైతులను అప్పులు చేయండి రుణమాఫీ చేస్తా అన్నారని.. 78 శాతం రైతులకు రుణ మాఫీ జరగలేదన్నారు. ధరణి పోర్టల్ గురించి మాట్లాడటం లేదన్నారు. 56 వేలకోట్ల విలువైన నిర్మాణాలను హైడ్రా పేరుతో కూల్చారని.. చట్ట విరుద్ధంగా హైడ్రా పెట్టారంటూ మండిపడ్డారు.