Share News

Lagacharla: లగచర్ల దాడి కేసు.. విచారణలో సంచలన విషయాలు

ABN , Publish Date - Dec 10 , 2024 | 11:01 AM

Telangana: కోర్టు ఆదేశాల మేరకు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయితే నరేందర్ రెడ్డి, సురేష్ కస్టడీ విచారణలో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. నరేందర్ రెడ్డి విచారణకు సహకరించలేదని కోర్టుకు పోలీసులు తెలిపారు. లగచర్లలో దాడికి ముందు జోరుగా లిక్కర్ పార్టీలు జరిగాయని ఖాకీలు తెలిపారు. దాడికి ముందు 3 రోజుల పాటు లిక్కర్ పార్టీలు జరిగాయన్నారు.

Lagacharla: లగచర్ల దాడి కేసు.. విచారణలో సంచలన విషయాలు
BRS Former MLA Patnam Narender Reddy

హైదరాబాద్, డిసెంబర్ 10: లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కుంటున్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని (Former MLA Patnam Narender Reddy) పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అలాగే ఈ కేసులో నిందితుడు సురేష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయితే నరేందర్ రెడ్డి, సురేష్ కస్టడీ విచారణలో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. నరేందర్ రెడ్డి విచారణకు సహకరించలేదని కోర్టుకు పోలీసులు తెలిపారు. సురేష్‌పై మరో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆధారాలు ధ్వంసం చేశాడని ఆరోపించారు.

టాస్క్‌ఫోర్స్‌లో కానిస్టేబుళ్ల త్రయం


అలాగే లగచర్లలో దాడికి ముందు జోరుగా లిక్కర్ పార్టీలు జరిగాయని ఖాకీలు తెలిపారు. దాడికి ముందు 3 రోజుల పాటు లిక్కర్ పార్టీలు జరిగాయన్నారు. నిందితుడు సురేష్ కోస్గిలో మందు కొని లగచర్లకు తరలించినట్లు విచారణలో బయటపడింది. సురేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారనంగానే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కోస్గి ఎక్సైజ్ పోలీసుల నుంచి సమాచారం సేకరించారు. స్థానికులను రెచ్చగొట్టి, దాడులకు దిగిన నేతలు, కార్యకర్తలతో నిందితులు పలుమార్లు సమావేశాలు అయినట్లు తెలుస్తోంది. అలాగే పథకం ప్రకారమే సురేష్ అనుచరులు కోస్గి నుంచి లిక్కర్ బాటిల్స్ తరలించినట్లు గుర్తించారు. భూసేకరణ అడ్డుకోవడం, ఆర్థిక సాయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో పట్నం నరేందర్ రెడ్డి, సురేష్‌లను మరో వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరనున్నారు.


కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కుంటున్న పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకీ ఇవ్వాలని కోరగా.. రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కొడంగల్ మున్సిపల్ కోర్టు అనుమతించింది. అధికారులపై దాడి ఘటనలో ఆయన ప్రమేయం ఉందని, ఆయన్ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు అంగీకరించింది. దీంతో చర్లపల్లి జైలులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంగా శని, ఆదివారాల్లో నిందితుడిని న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారించారు. హైదరాబాద్ మల్టీ జోన్ - 2 ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి తదితరులు పట్నంను ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. లగచర్లలో భూసేకరణ విషయమై అభిప్రాయాలు తెలుసుకోవడానికి వెళ్లిన అధికార్లపై దాడులు చేశారంటూ 71 మందిపై కేసులు నమోదు అయ్యిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

ఆ పన్ను తీసేశాం.. మంత్రి నారాయణ కీలక నిర్ణయం

ఈ నీళ్లు తాగితే 5 రోగాలు వెంటనే మాయం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 10 , 2024 | 11:03 AM